బిగ్ బాస్ షో కోసం.. వార్నింగ్ ఇచ్చిన పోసాని
తెలుగులో కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ షో ని అతి త్వరలో ప్రారంభం చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షోలో పాల్గొనే సెలెబ్రేటిల కోసం.. స్టార్ మా ప్రతినిధులు ఎంపిక చేసే పనిలో పడ్డారు.
అందుకోసం చాలామంది.. నటినటులను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా.. పోసాని కృష్ణ మురళిని కూడా ఈ షో కోసం ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రతి విషయంను డైరెక్టగా చెప్పే పోసారి.. ఈ షోలో పాల్గొంటాడని అందరు అనుకున్నారు.
అందుకుఏ 2.5 కోట్లు ఇచ్చిమారి పోసానిని తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలో అసలు నిజం లేదని ఖరాకండిగా చెప్పేశాడుమ్ పోసాని. ఈ విషయంపై స్వయంగా పోసాని కృష్ణ మురళి స్పందించారు. ఓ ఛానల్ వాళ్లు ఈ విషయం గురించి అడగగా.. పోసాని మాత్రం కొంచెం సీరియస్ గా ‘ఇక నోరు మూసుకోండి’.. ఆ విషయంలో అసలు నిజం లేదని దిమ్మతిరిగేలా మీడియా వారికీ జవాబు ఇచ్చాడు. ఇప్పటివరకు స్టార్ మా వాళ్ళు కనీసం అతనిని సంప్రదించలేదట. తనను ఈ విషయంపై ఎవరు ఇంతవరకు.. కలవలేదని.. చెప్పాడు. అయితే ఒకవేళ ఎవరిన.. అలాగని సంప్రదిస్తే.. అందులో చేస్తారా అని అడిగితే.. ఇక ఇంతటితో నోరు మూసుకోండి.. అంటూ ఫన్నీ గా జవాబు ఇచ్చాడు పోసాని కృష్ణ మురళి.
Post a Comment