శేఖర్ కముల్లా “ఫిదా” రివ్యూ & రేటింగ్


Cast & Crew:
నటీనటులు: వరుణ్ తేజ్, సాయి పల్లవి, సత్యం రాజేష్ తదితరులు
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
నిర్మాత: దిల్ రాజు

దర్శకత్వం: శేఖర్ కముల

Story:
అమెరికాలో ఉన్న “వరుణ్ (వరుణ్ తేజ్)” ను పరిచయం చేస్తూ ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అతని అన్నకు పెళ్లి సంబంధం చూడాలని ఇద్దరు కలిసి ఇండియా కి వస్తారు. ఈ క్రమంలో తెలంగాణ అమ్మాయి “భానుమతి” ని కలుస్తాడు. భానుమతి అక్కతో వరుణ్ అన్న పెళ్లి నిశ్చయమవుతుంది. వరుణ్ తో ప్రేమలో పడుతుంది భానుమతి. ఇంతలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోతారు. వరుణ్ తన తప్పుని అర్ధం చేసుకొని భానుమతి ని కలుద్దామని వస్తాడు. ఇంతలో భానుమతిని తన తండ్రి అమెరికా తీసుకెళ్తాడు. హర్షవర్ధన్ తో పెళ్లి నిశ్చయిస్తారు. భానుమతి వరుణ్ ప్రేమను అర్ధం చేసుకుంటుందా? వారి ఇద్దరి పెళ్లి జరుగుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే “ఫిదా” సినిమా చూడాల్సిందే!

Review:
శేఖర్ కముల బ్రాండ్ సినిమా గురించి కొత్తగా చెప్పనవసరంలేదు. హ్యాపీ డేస్ లో చూసేసాము. ఒక మంచి బలమైన లవ్ స్టోరీని అద్భుతంగా తెరకు ఎక్కించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎమోషన్స్ ని బాగా క్యారీ చేసింది. వరుణ్ తేజ్ యాక్టింగ్ సూపర్. సాయి పల్లవి నటనకు, తెలంగాణ యాసకు థియేటర్ లో ఫిదా అవ్వాల్సిందే. పాటలు బాగున్నాయి. పాటల చిత్రీకరణ కూడా కనువిందుగా ఉంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ మాత్రమే కాదు, కామెడీ సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి. ఇక క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ డైలాగ్స్ కి అయితే అందరు కనెక్ట్ అయిపోతారు.

Plus Points:

వరుణ్ తేజ్, సాయి పల్లవి కెమిస్ట్రీ
శేఖర్ కముల స్క్రీన్ ప్లే, స్ట్రాంగ్ స్టోరీ
ఎమోషనల్ డైలాగ్స్
మ్యూజిక్
కామెడీ సీన్స్
పాటల చిత్రీకరణ
లొకేషన్స్
సినిమాటోగ్రఫీ

Final Verdict:
love – hate – love story “fidaa”
Rating: 3.75/5

No comments