డ్రగ్స్‌ వ్యవహారంతో మెగా హీరోకు సంబంధం


డ్రగ్స్‌ వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా ఉన్న విషయం తెల్సిందే. పలువురు సెలబ్రెటీలు డ్రగ్స్‌ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లుగా అనుమానితుల జాబితాలో ఉన్నారు. పలువురు స్టార్స్‌ ఇప్పటికే డ్రగ్స్‌ వ్యవహారంలో పోలీసుల నుండి నోటీసులు అందుకున్నారు.
అయితే సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ డ్రగ్స్‌ వ్యవహారంలో ఇంకా పలువురు ప్రముఖులు కూడా ఉన్నారని, అయితే పోలీసులు వారి పేర్లను తప్పించి కొందరికి మాత్రమే నోటీసులు అందించారని అంటున్నారు. ముఖ్యంగా సురేష్‌బాబు తనయుడు అభిరామ్‌ ఈ వ్యవహారంలో ముందు ఉన్నాడనే చర్చ జరుగుతుంది. అభిరామ్‌కు ఆ విషయంతో సంబంధం లేదు అంటూ ఇప్పటికే సురేష్‌బాబు ప్రకటించినా కూడా మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది.

ఇక ఈ వ్యవహారంలో ఒక మెగా హీరోతో కూడా సంబంధం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ హీరో మరెవ్వరో కాదు అల్లు శిరీష్‌. పబ్‌లు, క్లబ్‌లు అంటూ తిరిగే అల్లు శిరీష్‌ చాలా కాలంగానే డ్రగ్స్‌కు అలవాటు పడ్డట్లుగా తెలుస్తోంది. అల్లు శిరీష్‌తో పాటు ఇంకా పదుల సంఖ్యలో సినీ ప్రముఖులు డ్రగ్స్‌ తీసుకుంటున్నారనే టాక్‌ వినిపిస్తుంది.

మెగా హీరో ఈ డ్రగ్స్‌ కేసులో ఉన్నారనే విషయం ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తుంది. అల్లు శిరీష్‌, అభిరామ్‌లతో పాటు ఇంకా పలువురు ప్రముఖుల కొడుకులు కూడా ఈ వ్యవహారంతో సంబంధం ఉందని, కొందరు డ్రగ్స్‌ తీసుకోవడంతో పాటు మరి కొందరు డ్రగ్స్‌ను సరఫరా చేసే వారిలో ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వారిని మాత్రం పోలీసులు ఏమీ అనబోవడం లేదు.

No comments