“డాక్టర్ సమరం” గారు ఫేస్బుక్ లో..! ఇన్బాక్స్ లోకి ఎలాంటి వింత ప్రశ్నలో చూడండి! వాటికి జవాబులు కూడా!


శృంగార సమస్యలకు చక్కని సమాధానాలు ఇస్తూ… దంపతుల అన్యోన్య జీవితానికి, యువత లోని అర్థం లేని భయాలను పొగొట్టడానికి తన జీవితాన్ని ధారపోసిన వ్యక్తి డాక్టర్ సమరం.  శృంగారం అంటే అది ఓ గదికే పరిమితమైన రోజుల్లో టివిల్లోకి వచ్చి మరీ దానికి సంబంధించిన వివరాలను చెబుతూ అపోహలను పొగొడుతూ… ఎవరికీ చెప్పుకోలేని శృంగార సమస్యలపై జనాన్ని చైతన్యం చేసింది వందశాతం సమరమే అని చెప్పాలి. అయితే ఆయన మీద ఓ జోక్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది.. తనుకు వచ్చే మెసేజ్ లు ఎలా ఉంటాయ్, దానికి సమరం ఇచ్చే సమాధానాలు ఎలా ఉంటాయ్ అనే ఆలోచన ప్రకారం ఇది ఎవరు రాశారో తెలీదు కానీ, చాలా ఫన్నీగా ఉంది. ( అన్యదా భావించవద్దు- నవ్వించాలనే ఉద్దేశ్యంతోనే దీనిని పోస్ట్ చేస్తున్నాము.)

డా. సమరం ఫేస్ బుక్ లోకి వస్తే ఆయన పేజ్ ఎలా ఉంటుందంటే…..

1. ప్ర: అయ్యా సమరంగారూ! ఫేస్బుక్ ఎక్కువ వాడితే మగవాళ్ళకి అలసట, ఆడవాళ్లకి అనారోగ్యం చుట్టుకుంటాయి అనుకుంటున్నారు అంతా. దీనికి మీరేమంటారు?
జ: ఫేస్బుక్ వాడటం వల్ల శక్తి తగ్గిపోయి అలసట, అనారోగ్యం చుట్టుకుంటాయి అనేది పచ్చి అబద్ధం. అలసటకి ముఖ్యకారణం నిద్రలేమి, అది సినిమాలు చూడటం వల్లనైనా, లేక సుత్తి కబుర్లు చెప్పుకోవటం వల్లనైనా రావచ్చు. దానికీ ఫేస్బుక్ కీ సంబంధం ఏమీ లేదు.

2. ప్ర: డాక్టర్ గారూ! నిన్న రాత్రి నేను ఫేస్బుక్ లోకి లాగ్ అవుదామని ప్రయత్నించి మూడు సార్లు ఫెయిల్ అయ్యా. మూడు సార్లూ password తప్పు అని error వచ్చింది. నేనిక ఫేస్బుక్ కి పనికిరానేమోనని అనుమానంగా ఉందండీ
జ: ఫేస్బుక్ లోకి లాగిన్ అవలేకపోవటం జబ్బు కాదు. మీ కీబోర్డుకేసి ఒకసారి చూసుకోండి Caps lock ఆన్ అయి ఉంటుంది. దాన్ని off చేసి హాయిగా లాగిన్ అవ్వండి

3. ప్ర: డాక్టర్! ఫేస్బుక్ ఛాటింగ్ ముందు కాస్తంత మద్యం సేవిస్తే కబుర్లు హుషారుగా ఉంటాయని నా స్నేహితుడొకడన్నాడు. దానిలో నిజం ఎంత?
జ: ఛాటింగ్ ముందు మద్యం సేవించటం చాలా హానికరం. ఉన్న మతికాస్తా పోయి అవాకులూ చెవాకులూ పేలితే స్నేహితులు కూడా శతృవులయిపోతారు.

4. ప్ర: సమరంగారూ! ఫేస్బుక్ వల్ల గొడవలెక్కువై సంసారాలు కుప్పకూలుతున్నాయని కొంతమంది ఆరోపిస్తున్నారు. మీరేమంటారు?
జ: గొడవలయ్యేది ఫేస్బుక్ వల్ల కాదు – అది కొంతమంది సహజతత్వం. ఫేస్బుక్ లేకపోయినా యహూ వల్లనో, గూగుల్ ఛాట్ వల్లనో, అదీ కాకపోతే సెల్ ఫోన్ వల్లనో జరిగేవి జరుగుతూనే ఉంటాయి.

5. ప్ర: డాక్టర్జీ! రోజుకి ఎంతసేపు ఫేస్బుక్ లో ఉంటే ఆరోగ్యకరం?
జ: అది మనిషిని బట్టీ ఉంటూంది. మీ పనులని మానుకోకుండా ఎంతసేపున్నా ఫరవాలేదు. పనులున్నప్పుడు ఒక్క నిముషం ఫేస్బుక్ మీదున్నా అది వృధానే!

( రాసిన వారికి అభినందనలు)

No comments