సెక్స్ చేస్తున్నప్పుడు చూడటం అతని జాబ్.. దానికి ఎంత సంపాదిస్తున్నాడంటే..
ప్రపంచంలో ఎన్నో రకాల ఉద్యోగాలుంటాయి. ఎవరైనా తమ చదువుకు అనుగుణంగా ఉండే ఉద్యోగాలనే కోరుకుంటారు. కానీ, ఇక్కడ ఓ వింత ఉద్యోగం చేస్తున్నాడు ఓ వ్యక్తి. ప్రస్తుతం భాగస్వామితో తమ శృంగారంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పలువురు పరిశోధకులు, రాజకీయ నాయకులు కూడా నిపుణుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్న సంగతి మనకి తెలిసిందే.
ఈ క్రమంలో ఓ కొత్త ఉద్యోగం అవతరించింది. దంపతులు తమ ఇంట్లో శృంగారం చేసుకుంటుండగా చూసి.. వారు చేస్తున్న తప్పులను సరిదిద్ది, వారికి సక్రమమైన శృంగార విధానాలను చెప్పేదే ఈ ఉద్యోగం. కెన్నత్ ప్లే అనే మాజీ ఫిట్నెస్ ప్రొఫెషనల్.. సుమారు 50కిపైగా దేశాల్లోని చాలా మందికి కోచింగ్ ఇచ్చి వారి నుంచి ఒక సెషన్‌కి రూ. 67వేలను పొందుతున్నాడు. వారు సెక్స్ చేస్తుండగా చూసి.. ఆ తర్వాత వారికి శృంగారంలో ఏ విధంగా పాల్గొంటే బాగుంటుందని అతడు సూచనలు చేస్తాడు. సెక్స్ పార్టీస్ వరకే పరిమితమైన తన వ్యాపారాన్ని కొందరు సిగ్గరుల కోసం తమ ఇంటికే వెళ్లి సూచనలు చేస్తున్నాడు కెన్నత్ ప్లే. ఇలా పడక గదిలో శృంగారం సంతృప్తిగా సాగేందుకు సూచనలు చేస్తూ కెన్నత్ భారీగా సంపాదిస్తున్నాడు. ప్రపంచంలో ఇలాంటి ఉద్యోగం కూడా ఉంటుందా? అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. అతనికి మాత్రం భలే గిరాకీ వస్తుండటం గమనార్హం.
Post a Comment