రొమాన్స్ కోసం దెయ్యాన్ని అడ్డం పెట్టుకున్న.. 9వ తరగతి అమ్మాయి, ఇంటర్ అబ్బాయి


అనంతపురం శివార్లలో జరిగిన ఓ స్టోరీ సినిమాని, సీరియల్ ని తలపిస్తుంది. అనంతపురం శివార్లలో ఉన్న ఓ ప్రముఖ విద్యా సంస్థ లో హైస్కూల్, ఇంటర్ కాలేజీలు ఉండగా.. వాటికి అనుబంధంగా ఓ హాస్టల్ కూడా ఉంది. ఆ హాస్టల్ లో దెయ్యాలు తిరుగుతున్నాయన్నది చాలా రోజులుగా వినిపిస్తున్న వదంతి. అలానే.. ఓ ఇంటర్ విద్యార్థికి ఓ రోజు దెయ్యం కనిపించిందట. ఈ విషయాన్ని అందరికీ చెప్పేవాడు. అయితే.. తాను దెయ్యాన్ని కనుగొనాలని అన్వేషణ మొదలు పెట్టానని చెప్పేవాడు. రాత్రిపూట పాఠశాల పైకప్పు ఎక్కి అక్కడ తిరుగుతూ ఉండేవాడు. దీన్ని చూసిన కొందరు విద్యార్థులు ప్రశ్నించగా.. రాత్రుళ్లు తిరిగే దెయ్యాలను కనుగొనాలని వెళ్లినట్టు చెప్పాడు.

అయితే.. అక్కడ అసలు స్టోరీ మరొకటి ఉంది. పక్కనే ఉన్న హైస్కూల్ లో 9వ తరగతి చదువుతున్న అమ్మాయిని ప్రేమించాడు ఆ ఇంటర్ అబ్బాయి. రాత్రి కాగానే ఆమెని ఏకాంతంగా కలుసుకునేందుకు అక్కడ దెయ్యాలు ఉన్నాయని ప్రచారం చేసేవాడు. అయితే.. గత వారంలో వీరి రొమాన్స్ ని కాలేజీ సిబ్బంది పసిగట్టింది. వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోని చితకబాది, రాత్రికి రాత్రే టీసీ ఇచ్చి పంపించారు. ప్రస్తుతం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమైన ఈ విషయమై.. పాఠశాల కరస్పాండెంట్ స్పందిస్తూ.. 9వ తరగతి అమ్మాయికి, ఇంటర్ అబ్బాయికీ మధ్య ప్రేమాయణం సాగుతున్న విషయం తెలియడంతో.. ఇతర విద్యార్థులు ఇలా చేయకుండా ఉండాలనే కఠినంగా వ్యవహరించామని చెప్పారు. అయితే.. వేలకు వేలు పోసి హాస్టల్ లో ఉంచి తమ బిడ్డలను చదివిస్తుంటే.. వారిపై సరైన నిఘా ఉంచడంలో యాజమాన్యాలు విఫలం అవుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

No comments