నీలి చిత్రాలు ఎక్కువగా చూసే వారికి ఆ ఫీలింగ్స్ ఎక్కువంట


ప్రస్తుతం ప్రప్రంచం మన అర చేతిలోకి స్మార్ట్ ఫోన్ రూపంలో వుంది. ఏది కావాలంటే అది మనకి వెంటనే తెలుస్తుంది. ఇది నాణేనాకి ఒక వైపు. ఇంకోక వైపు చెడు కూడా అలా తెలుస్తుంది. అందులో మొదట చెప్పుకోనేది పోర్నోగ్ర‌ఫీ (నెట్‌లో నీలి చిత్రాలు చూడ‌డం). ఇది యువతలో చాలా ఎక్కువన్నా విషయం కూడా మనకు తెలిసిందే.

తాజాగా దీనిపై అమెరికాలోని ‘జర్నల్‌ ఆఫ్‌ సెక్స్‌ రీసెర్చ్’లో ని ఒక పరిశోధక బృందం ప‌లు అశక్తికరమైన, ఆశ్చర్యకరమైన విషయాలు బయటపెట్టారు. వారి ప్రకారం నీలి చిత్రాలు చూసే వారిలో ఆధ్యాత్మిక భావన‌లు ఎక్కువగా క‌లుగుతున్నాయ‌ట‌.వారు 6 ఏళ్ల పాటు 1314 మందిపై ప్ర‌యోగాలు చేసి దీనిని నిర్దారించారు. వారిలో ఆధ్యాత్మిక భావన‌లు కలగడానికి కారణం వారంతా తామంతా ఏదో త‌ప్పు చేశామ‌ని ఫీల‌వుతూ దైవ స‌న్నిధిలో ఎక్కువ‌గా గ‌డిపేందుకు వెళ్తున్నార‌ట‌.అందుకే వారికి ఆధ్యాత్మిక భావన‌లు ఎక్కువగా వుంటాయి అని చెప్పారు.

No comments