రావు రమేష్ కి ఫోన్ చేసిన పవన్ కళ్యాణ్


తన సినిమాలు తప్ప వేరేవారి సినిమాలు పెద్దగా చూడను అనీ , చూడడానికి ఇష్టపడను కూడా అని ప్రకటించిన పవన్ కళ్యాణ్ చివరికి బాహుబలి కూడా చూడలేదు అని చెప్పి ఒక ఇంటర్వ్యూ లో ఆశ్చర్యపరిచారు. అలాంటి పవన్ కళ్యాణ్ తన ప్రాణ మిత్రుడు త్రివిక్రమ్ సినిమా ని చూడ్డం వెనక ఏం రహస్యం ఉంది అని అనుకుంటున్నారు ఇండస్ట్రీ లో అందరూ. అత్తారింటికి దారేది లాంటి సినిమాని కూడా రిలీజ్ అయిన మూడు వారాల తరవాత చూసిన పవన్ తన సినిమాలనే లెక్క జేయడు కానీ ఈ సినిమా చూడడం వింతగా ఉంది.

త్రివిక్రమ్ దర్సకత్వం లో రూపొందించిన 'అ ఆ' సినిమా ని పవన్ చూసారు. ఈ విషయం ముందరే మనం ప్రకటించాం. ఆ సినిమా చూస్తున్న సమయం లో పవన్ కళ్యాణ్ ప్రొజెక్టర్ ఆపరేటర్ ని కొన్ని సీన్ లు రీప్లే చెయ్యమని కోరి మళ్ళీ మళ్ళీ చూస్తూ ఎంజాయ్ చేసాడట. అంత క్లోజ్ గా ప్రతీ సీన్ నీ పట్టి పట్టి చూసాడట కళ్యాణ్. అ ఆ స్టోరీ ని పవన్ కళ్యాణ్ కి ముందరే చెప్పిన త్రివిక్రమ్ తన అత్తారింటికి దారేది లాగానే ఉంది అని1 అన్నాడట.


అతి పేదవాడు గా ఉండే ఒక కుర్రాడు తన అత్త కూతురు ని , అత్యంత ధనిక పిల్లని లవ్ చెయ్యడం ఈ సినిమా స్టొరీ. తన సినిమా లాగానే ఉండడం వల్లనో సీన్ లకి సీన్ లు బాగా నచ్చడం వల్లనో కళ్యాణ్ ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేసాడు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే రావు రమేష్ క్యారెక్టర్ కళ్యాణ్ కి బాగా నచ్చిందట. ఆయన చేసిన సీన్ లు రిపీట్ లు పెట్టుకుని మరీ చూసాడట, రావు రమేష్ కి ఫోన్ చేసి ప్రత్యేక అభినందనలు చెప్పాడట కళ్యాణ్.

No comments