బాహుబలి ఆస్కార్ పై జక్కన్న సంచలన కామెంట్..!!
తెలుగు ఇండస్ట్రీలో జూలై 10 రిలీజ్ అయిన ‘బాహుబలి’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనాలు సృష్టిస్తుంది. రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి చిత్రం అంతర్జాతీయ స్ధాయి చిత్రమని, హాలీవుడ్ స్టాడర్డ్స్ లో నిర్మించారనే టాక్. ఈ సినిమా నాలుగు భాషల్లో విడుదలై రికార్డుల మోత మోగిస్తుంది. తెలుగు లో ఈ రకమైన చిత్రాలు ఈ మద్య కాలంలో రాలేదని అన్ని సినీ వర్గాల సెలబ్రెటీస్, రాజకీయ వేత్తలు, పారిశ్రామిక వేత్తలు రాజమౌళిపై ప్రశంసల జల్లు కురిపించారు.
ఇప్పుడు ఈ సినిమాకు ఆస్కార్ ఖాయమని అభిమానులు అంటున్నారు. అంతే కాదు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పోస్ట్ లు పెడుతున్నారు. ఇక ఎప్పటి నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రానికి మీడియాలో కూడా బాహుబలికి ఆస్కార్ వచ్చే అవకాసం ఉందని వినపడుతోంది. ఇక ఈ విషయంపై జక్కన్న స్పందిస్తూ... ఈ సినిమాకు ఆస్కార్ రావాలన్న ఆలోచన లేదని మంచి సినిమా ఎప్పుడైనా ఆదరణ పొందుతున్న విషయం బాహుబలితో రుజువైందని చెప్పారు.
భారతీయ సినిమాలు ఆస్కార్ కు చాలా అరుదుగా నామినెట్ అవుతాయి.. గతంలో పూర్తిగా గ్రాఫిక్స్ హై టెక్నాలజీతో రూపొందించిన ‘ఈగ’ అస్కార్ వస్తుందని అంచనాలు వేసారు. భారత్ దేశం నుంచి ఆస్కార్ కి పోటీ పడిన వాటిలో ఈగ కూడా ఉంది. అలాగే ఇప్పుడు బాహుబలి కూడా ఉంటుందనటంలో సందేహం లేదు. ఇప్పుడు 'బాహుబలి'ఐదొందల కోట్ల క్లబ్‌లో చేరింది.
గత నెల 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.500 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. అంతే కాదు ఇప్పటి వరకు తెలుగు సినిమా ఆ స్థాయిలో కలెక్షన్లు సాధించిన దాఖలాలు లేవు అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా భారీ స్థాయిలో వసూళ్లు చేస్తున్నాయి. అయితే హిందీ వెర్షన్ బాలీవుడ్ బాక్సాఫీసు వంద కోట్ల క్లబ్‌లో చోటు సంపాదించింది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/92977/world-records-approved-s-s-rajamouli-audiences-ba/
Post a Comment