కృష్ణ పరమాత్మ ఇంద్రలోకం నుంచి తెచ్చిన పారిజాత వృక్షం
కృష్ణ పరమాత్మ ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామకి బహూకరించిన పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారబంకి జిల్లాలో లోని కింటూర్ గ్రామం వద్ద ఉంది.
ప్రపంచంలో కెల్లా విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు దీనిని అభివర్ణించారు. ఈ వృక్షరాజం తన శాఖ ముక్కలు నుండి పునరుత్పత్తి గాని, పండ్లు గాని ఉత్పత్తి చేయదు. అందుకే ఈ వృక్షం ఒక ప్రత్యేక వర్గంలో ఉంచబడింది. ప్రపంచంలోని ఏ ఇతర వృక్షానికీ లేని ప్రత్యేకత ఈ వృక్షం స్వంతం.
దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు, మన చేతి ఐదు వేళ్ళను పోలి ఉంటాయి, పై భాగన ఆకులు యేడు భాగాలుగా ఉంటాయి. వీటి పుష్పాలు కూడా చాలా అందంగా బంగారు మరియు తెలుపు రంగులతో కలిసిన ఒక ఆహ్లదకరమైన రంగులో ఉంటాయి. పుష్పాలు ఐదు రేకులు కలిగి ఉంటాయి. ఈ వృక్షం చాలా అరుదుగా వికసిస్తుంది.... అదీ జూన్ / జూలై నెలలో మాత్రమే. ఈ పుష్పాల సువాసన కూడా చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. ఈ వృక్షం యొక్క వయస్సు సుమారు 1000 నుంచి 5000 సంవత్సరాలుగా చెప్పబడుతుంది. ఈ వృక్ష కాండము చుట్టుకొలత 50 అడుగులుగాను, ఎత్తు 45 అడుగుల గాను చెప్పబడింది. ఈ వృక్షం యొక్క మరొక గొప్పతనం దీని శాఖలు గాని ఆకులు గాని కుంచించుకుపోయి కాండంలో కలిసిపోవటమే కాని ఎండిపోయి రాలిపోవటం జరగదు. ఇప్పుడు నిపుణులు ఈ వృక్షం మనుగడ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....!
Post a Comment