వాడ్ని చూసి ఆశ్ఛర్యపోయా: పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వద్ద నుండి ప్రశంసలు తీసుకోవాలంటే సామాన్య విషయం కాదు. పవన్ కళ్యాణ్ సామాన్యులకు ఏ మాత్రం అంతుపట్టుడు. అలాంటిది పవన్ కళ్యాణే స్వయంగా మరోకొకరి పనులకు ఆశ్ఛర్యపడ్డాడంటే ఇంకేముంది.
అది హాట్ టాపిక్ అవుతుంది. సరిగ్గా ఈ రోజు అటువంటిదే ఒకటి జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల ఎంపికలో డిఫరెంట్ ఎటెంప్ట్ చేస్తున్నాడు వరుణ్ తేజ్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ముకుంద చిత్రంలో నటించి, తరువాత బాడీ లాంగ్వేజ్ కి సూటయ్యే కథాంశాన్ని ఎంచుకున్నాడు. అదే క్రిష దర్శకత్వంలో వస్తున్న కంచె చిత్రం.
స్వాతంత్య్రం రాక ముందే జరిగిన కథతో క్రిష్ ఓ కొత్త ఎటెంప్ట్ చేస్తున్నాడు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నడిచే ఈ సినిమాకు అప్పటి మూడ్‌ను తీసుకురావడానికి దర్శకుడు క్రిష్ చాలా కృషి చేశారు. ఇక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కంచె ఫస్ట్ టీజర్‌ను విడుదల చేశారు. ‘ప్రేమ యుద్ధంలోనూ ఉంటుంది.
ఎక్కడైనా ప్రేమ యుద్ధంలానే ఉంటుంది’ అన్న డైలాగ్, విజువల్స్ చూశాక ఇది తెలుగు సినిమాయేనా అనే ఆశ్చర్యాన్ని మిగులుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ టీజర్ తో పాటు, మరి కొంత రషెస్ ని చూసిన పవన్ కళ్యాణ్, వీడు మన వరుణ్ తేజేనా..గ్రేట్ జాబ్..అంటూ పొగడ్తలతో ముంచెత్తాడంట. దీంతో ఈ న్యూస్ తాజాగా వెలుగులోకి వచ్చి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
source:apherald.com
Post a Comment