రష్యా లోని వజ్రాల గని


పాతాళం కాదది..మిర్ మైన్..
చూస్తుంటే పాతాళానికి దారిలా అనిపిస్తుందా?
అదేమీ కాదండి....... ఇది ‘మిర్ మైన్’.. దీన్నే ‘మిర్నే మైన్’ అని కూడా అంటారు.


రష్యా లోని తూర్పు సైబీరియా లో 1722 అడుగుల లోతు, 3900 అడుగుల వెడల్పు గల ఒకప్పటి వజ్రాల గని. జూన్ 13 , 1955 లో సోవియట్ సైంటిస్టులు ఇక్కడ వజ్రాల నిక్షేపాలున్నాయని కనుగొన్నారు. 1957 లో మొట్టమొదటి సారిగా వజ్రాల వెలికితీత ప్రారంభించారు.


ఈ గనిలో సరాసరి ఏటా 10000000 క్యారెట్ల వజ్రాలని ఉత్పత్తి చేసేవారు. 44 ఏళ్లు ఏకధాటిగా రష్యా కి వజ్రాలను అందించిన ఈ గని నిక్షేపాల లేమి కారణంగా జూన్ 2001 లో మూసివేసారు. తర్వాత కూడా తెరిచినా కొన్ని అనివార్యకారణాల వల్ల 2004 లో పూర్తిగా మూతబడింది

No comments