బ్రహ్మ కల్పం-మహాయుగమంటే ఎంతకాలం? మన కాల గణనం.....
ఇది మన కాల గణనం. ఇంత నిశిత కాల గణన
ఇతరులకు అసాధ్యం. నానో సేకండ్స్ ని మన
వాళ్ళు ఎంత గా గుణించారో ఆశ్చర్యం వేస్తుంది.
100 తృటికలు – 1వేధ
3 వేధలు – 1 లవము
3 లవములు – 1 నిమిషం
3 నిమిషాలు – 1 క్షణం
5 క్షణాలు – 1 కాష్ట
15 కాష్టలు – 1 లఘువు
15 లఘవులు -- నిశిక
6 నిశికలు – 1 ప్రహర
4 ప్రహరలు – 1 దినం
15 దినాలు -- 1 పక్షం
2 పక్షాలు – 1 మాసం
2 మాసాలు – 1 ఋతువు
3 ఋతువులు – 1 ఆయనం
2 ఆయనాలు – 1 సంవత్సరం
12 సంవత్సరాలు – 1 తప
100 సంవత్సరాలు – 1 శతకం
10 శతకాలు – 1 సహస్రకం
4 సహస్రకాలు – 1 యుగం
4 యుగాలు – 1 మన్వంతరం
100 మన్వంతరాలు—1 బ్రహ్మదినం.
బ్రహ్మ కల్పం-మహాయుగమంటే ఎంతకాలం?
అనంతమైన ఈకాలమానంలో ఎన్నో
మహాయుగాలు గడిచిపోయాయి. ఎందరో
బ్రహ్మలు గతించారు. బ్రహ్మకు పద్మసంభవుడని
పేరు. బ్రహ్మకు ఇప్పటికి కాలమానంలో 50
సంవత్సరాలు గడిచి 51 సంవత్సరంలో శ్వేత
వరాహకల్పంలో ఆరు మన్వంతరాలు తర్వాత ఏడవ
మన్వంతరమైన వైవస్వతంలో 27
మహాయుగాలు గతించాయి. 28వ మహాయుగంలో 4వది
అయిన కలియుగం ఇప్పుడు నడుస్తున్నది. సహస్ర
చతురుయుగ సమానమైన బ్రహ్మ దివసాన్ని 14
మన్వంతరాలుగా విభజించడం జరిగింది.
మనమిప్పుడు సప్తమ మనువు వైవస్వతుని కాలంలో
ఉన్నాము. పూర్వం ఆరుగురు మనువులు,
ఒక్కొక్కరు 76
1/2 చతురుయుగాల చొప్పున
459 చతురుయుగాల కాలం అంటే దాదాపు 3కోట్ల
30లక్షల 50వేల సంవత్సరాలు పాలించారు.
కృతయుగం——-17,28,000
త్రేతాయుగం—– 12,96,000
ద్వాపరయుగం— 8,64,000
కలియుగం——- 4,32,000
_____________________
43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం.
_____________________
మన లెక్కల ప్రకారం
360 సంవత్సరాలు దేవతలకు ఒక సంవత్సరం.
అటువంటి 12వేల దేవసంవత్సరాలు అనగా
43,20,000 సంవత్సరాలు ఒక
చతుర్యుగం (మహాయుగం) అన్నమాట. 2వేల
చతుర్యుగాలు బ్రహ్మకు ఒక అహోరాత్రం.
360 అహోరాత్రాలు ఒక సంవత్సరం క్రింద లెక్క. అనగా
మనుష్యమానంలో
31,10,40,00,00,000 (311 లక్షల 4వేల కోట్లు)
సంవత్సరాలు.
ఈ చతురుయుగానికి మహాయుగమని పేరు. దీని
ప్రమాణం 43లక్షల 20వేల సంవత్సరాలు.
71 మహాయుగాలు కలిపి ఒక
మన్వంతరం అవుతుంది. ఇటువంటి 14
మన్వంతరాలు బ్రహ్మ దేవునికి ఒక పగలు, మళ్ళీ 14
మన్వంతరాలు ఒక రాత్రి.
28 మన్వంతరాల బ్రహ్మ దినాన్ని కల్పం అంటారు.
360 కల్పాలు బ్రహ్మకు ఒక
సంవత్సరం అవుతుంది. అలాంటి
నూరు సంవత్సరాలు బ్రహ్మ ఆయుష కాలం.
2000 మహాయుగాలు బ్రహ్మకు ఒక సంపూర్ణ
దివారాత్రం. 7లక్షల 20వేల మహాయుగాలు ఒక బ్రహ్మ
సంవత్సరం. ప్రస్తుతం 28వ మహాయుగంలోని 4వ
యుగమైన కలియుగంలో ప్రధమపాదంలో
5108 సంవత్సరాలు
మన్వంతరము:-
హిందువుల పురాణాల ప్రకారం ఒక మనువు యొక్క
పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు. ఒక్కొక్క
మన్వంతరము
30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ఒక
బ్రహ్మ దినము లో 14
మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి.
ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో
ఉన్నామని హిందువులు భావిస్తారు. ప్రతి
మన్వంతరము 71
మహాయుగములుగా విభజించబడినది.
ఎన్నెన్ని సంవత్సరాలు?
దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు
360 రెట్లు అధికము. అనగా మన ఒక
సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు +
రాత్రి). మన 30
సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన
360 సంవత్సరములు వారికి ఒక (దివ్య)
సంవత్సరము. ఇట్టి
12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య
యుగము (మహాయుగము). ఇది మనకు ఒక
చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన
43,20,000 సంవత్సరములు ఒక
మహాయుగము అగును.
• కృత యుగము =
4,800 దివ్య సంవత్సరములు =
17,28,000 మానవ సంవత్సరములు
• త్రేతా యుగము =
3,600 దివ్య సంవత్సరములు =
12,96,000 మానవ సంవత్సరములు
• ద్వాపర యుగము =
2,400 దివ్య సంవత్సరములు =
8,64,000 మానవ సంవత్సరములు
• కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు =
4,32,000 మానవ సంవత్సరములు
• మొత్తము 12,000 దివ్య సంవత్సరములు =
43,20,000 మానవ సంవత్సరములు – ఒక దివ్య
యుగము (చతుర్యుగము, మహాయుగము)
ఇలాంటి వేయి దివ్య
యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ
పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి
దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి.ఈ
రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి
360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము.
అటువంటి
100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.
Post a Comment