గెలిచావురా తెల్లొడా ---
గెలిచావురా తెల్లొడా ------------- స్వాత్యంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలయిన ఇప్పటికి నువ్వే గెలుస్తున్నావ్, మా సాంప్రదాయ పండగలకన్నా నీ New Year పండగె మాదేశ యువతకు నచ్చింది. మా సాంప్రదాయ ఆటలకన్నా నీ దేశపు Cricket ఆటే మా యువతకు నచ్చింది. మా సాంప్రదాయ వస్త్రాలకన్నా నీ దేశపు Jeans వస్త్రధొరణే మాదేశ యువతకు నచ్చింది. మా సాంప్రదాయ భాషలకన్నా నీ దేశపు English భాషే మా యువతకు నచ్చింది. గెలిచావురా తెల్లొడా.... అంతెందుకు మా సాంప్రదాయపు ఖురాన్,భగవద్గీత,బైబిల్ పుస్తకాలకన్నా నీ తెల్లొడు రాసిన Facebook పుస్తకంతోనె మాదేశపు యువతకు తెల్లారుతుంది. "యువతే దేశానికి వెన్నుముక్క" అని మాదేశపు పెద్దలు అన్నమాట మా యువతకు నచ్చిందొ లేదొకాని నీకుమాత్రం బాగా నచ్చినట్టుంది అందుకె తాతల కాలంలొ స్వాత్యంత్రం ఇచ్చినట్లె ఇచ్చి మా యువతను ఇప్పటికి బానిసలుగానె ఉంచావు కదరా.... గెలిచావురా తెల్లొడా... "పక్కనొడి శ్రమను గుర్తించాలి" అన్న మా భారతీయుల మనొభావాన్ని 100% వాడేస్తున్నావు... భారతదేశ యువతపై నువ్వు ఏ దేశపు వాడితొ పందెం కట్టినట్లున్నావొలె కాని By గెలిచావురా తెల్లొడా..... మేము మారము....గాంధిలాంటి వాళ్లు మళ్ళీ పుడితే ఆయన హీరో అవ్వటానికి మరో అవకాశం కలిపిస్తాం. ----- జైహింద్----
Post a Comment