నాగ్ అస్త్రం ‘అఖిల్’ అదిరిపోయింది


అక్కినేని మూడో తరం హీరో అఖిల్ గ్రాండ్ ఎంట్రీకి రంగం సిద్ధమైందని తెలిసినప్పటి నుండి ఆ సిసింద్రి బోయ్ ని ఎప్పుడెప్పుడు థియేటర్లో చూద్దామా అని ఎదురుచూస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. మనం సినిమాలో అలా వచ్చి ఇలా వెళ్లిన అఖిల్ ఇక ఫుల్ లెంథ్ సినిమా ఎప్పుడని వెయిట్ చేశారు. వినాయక్ తో సినిమా స్టార్ట్ చేశాడని తెలియగానే ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక వదిలిన మేకింగ్ వీడియోస్ లో అఖిల్ ఇరగదీస్తుంటే అదుర్స్ అన్నారు. ఇలా ప్రతి ఒక్క సెన్షేషన్ తో థ్రిల్ చేస్తున్న అఖిల్ తన అభిమానులకు మొదటి సినిమా ఫస్ట్ లుక్ తో కూడా ట్రెండ్ సెట్ చేశాడు.

ఎన్నో భారీ అంచనాలతో వస్తున్న అఖిల్ అక్కినేని మొదటి సినిమా టైటిల్ అఖిల్ అవ్వడమే విశేషం. మొన్నటివరకు వేరు వేరు టైటిల్స్ వినపడ్డా చివరకు తన పేరునే టైటిల్ గా పెట్టి సూపర్బ్ అనిపించాడు అఖిల్. ఫస్ట్ లుక్ పోస్టరే ఇలా కేకపెట్టేలా ఉంటే ఇక సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అని అక్కినేని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రి రిలీజ్ బిజినెస్ కూడా భారీ రేంజ్లో అయ్యిందని మనకు తెలిసిందే. కింగ్ నాగార్జున ఏ విధంగానైతే అఖిల్ ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడో ఎక్సాక్ట్ అలానే ఫాలో అవుతున్నాడు.

హీరో నితిన్ ప్రొడ్యూస్ చేస్తున్న అఖిల్ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ నుండి మాస్ ఫాలోయింగ్ కోసం కింగ్ నాగార్జున సంధించిన అస్త్రమే ఈ అఖిల్. అక్కినేని ఫ్యామిలీలో ఎవరికి లేనంత క్రేజ్ ఈ సూపర్ హీరోకి వచ్చింది. సయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.

మొత్తానికి నాగ్ వదిలిన అఖిల్ అస్త్రంతో అక్కినేని ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకుంటున్నారు. ఇక సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఫస్ట్ లుక్ మాత్రం అదుర్స్ అబ్బా.. ఆల్ ది బెస్ట్ టూ అఖిల్ అక్కినేని.

source;apherald.com

No comments