నాగ సాధువులు..అఘోరా సాధువులు...సాధువులు ,అఘోరీ తత్వం - అఘోర ధర్మం


నాగ సాధువులు… అఘోరా సాధువులు:
అఘోరా సాధువులు...సాధువులు ,...అఘోరీ తత్వం - అఘోర ధర్మం
------------------------------------------------
అఘోరీ తత్వం లేదా అఘోర ధర్మం అనే వి రెండూ, ఒకదానికి మరొకటి పర్యా య పదాలు. వ్యవహరించే పదం ఏదైనా దాని పరమార్ధం ఒక్కటే. అఘోరీలు అనేబడేవారు ఒక మతానికో, ఒక మతంలోని అంతర్భాగ మో కాదు. ధర్మ వినాశ నం ఏర్పడిన సందర్భా ల్లో ధర్మాన్ని పునరుద్ధ రించడానికి ఉద్భవించి న వారే యోగులు, మహాత్ములు........అఘోరీలు పూజించే దెవరిని?
అఘోరీలు పరమ శివుని లేదా ప్రకృతికి మ రు స్వరూపమైన శక్తిని ఇష్టదైవంగా కొలుస్తా రు, ఆరాధిస్తారు. వీరినే ఉఎాసించి సాధన ద్వారా అష్ట సిద్దులు పొందుతారు. వారు చేసే సాధనల్లో కామరూపం, అగ్ని ప్రాయోపవే శం, పరకాయ ప్రవేశం ప్రముఖమైనవి. కామరూప సిద్ధి వల్ల వీరు ఒకసారి యువకు డిలా, మరోసారి వృద్దుడిలా, పురుషుడి వలె ఒకసారి, స్త్రీ వలె మరోసారి వేర్వేరు రూఎా ల్లో సంచరించగలుగుతారు........
ఈ సమాజం పెట్టిన ఏ నియమాన్నీ అంగీకరించరు అఘోరీ సాధువులు! అఘోరీ సాధువు స్మశానంలోనే నివసిస్తాడు. చితిమీది మంటల్లోనే అన్నం వండుకుంటాడు. తినడానికీ, తాగడానికీ పాత్రలాగా మానవ కపాలాన్నే ఉపయోగిస్తాడు. ఇది తినొచ్చు, ఇది తినకూడదు అన్న నియమం పెట్టుకోడు. అవసరమైతే పెంట కూడా తింటాడు. శవాలని నంచుకుంటాడు. మూత్రం తాగుతాడు. ఎముకలతోగానీ, కాపాలాలతోగానీ చేసిన మాలని మెడలో ధరిస్తాడు. శవాల మీద కప్పిన బట్టలని తన పక్కబట్టలుగా ఉపయోగిస్తాడు. ఎప్పుడూ నగ్నంగా తిరిగే అఘోరీ సాధువు అత్యవసరమైనప్పుడు మాత్రమే చెట్టు బెరడుతో జననేంద్రియాలని కప్పుకుంటాడు.
సాధారణంగా సాధువులు యాచన కోసం, తినడం కోసం, ఒక బొచ్చెలాంటిది చేతిలో ఉంచుకుంటారు. నీళ్ళూ అవీ తాగడానికి వేరే కమండలం ఉంచుకుంటారు... కానీ అఘోరీ సాధువు తినడానికీ, తగడానికీ, యాచించడానికీ, మంత్రతంత్రాలకీ అన్నిటికీ ఒక మానవ కపాలాన్ని ఉపయోగిస్తాడు.
ఆ కపాలం కూడా, చనిపోయిన పురుషుడిది అయివుండాలి. కపాలాన్ని కళ్ళ పైభాగం నుంచి కోసేసి, దాన్నే పాత్రగా ఉపయోగించాలని వాళ్ళ తెగలోని కఠోర నియమం! అలా చేసినప్పుడే దారి రహస్య మంత్రతంత్రాలు ఫలిస్తాయిఅని ప్రఘాడ నమ్మకం ఈ శ్మశానాల్లోనే చిత్ర విచిత్ర వేషధారులైన సాధువులు అఘో రీలను తలపిస్తూ అరుదుగా సంచరిస్తుంటా రు.
."నాగ సాధువులు'"...ఎక్కడనుండి వస్తారో ..ఎక్కడ ఉంటారో తెలియని ....నాగ సాధువులు
-----------------------------------------------------------
నగ్నయోగసాధన వల్ల..
నెగటివ్ ఎమోషన్స్ నుండి బయటపడతాం.
మనల్ని గురించి మనేక బాగా తెలిసివస్తుంది.
మనల్ని మనం ప్రేమించుకోగలగటమే కాక ఇతరుల్ని సైతం ప్రేమించగలగుతాం.
మనలో వైయక్తికవికాసం, ఆత్మవిశ్వాసం అధికం కావటమే కాక, వాటితో ఇతరుల్నీ ప్రభావిం చేయగలం.
మొత్తానికి నగ్నత్వం అంటే భౌతికంగా నూలుపోగు లేకుండా ఉండటమే కాదు... మానసికంగాను అన్ని ప్రాపంచిక అపేక్షల్నీ త్యజించటం ... ఏమాత్రం కామదాహం లేకుండా ఉండటం.
నాగ' అంటే ఏమిటి?కొన్ని ఆధారాల ప్రకారం 'నాగ' అంటే నగ్నంగా అని చెప్పుతారు. ఈ సాధువులు పూర్తిగా వేరుచెయ్యబడిన మరియు వారు అన్ని మార్గాలలో వారి వియోగంను సాధన చేస్తారు. వీరు కుంభమేళాలో ప్రధాన ఆకర్షణ. ఎక్కడెక్కడి నుంచో నాగసాధువులంతా కుంభమేళాకు తరలివస్తారు. మేళా జరిగినన్ని రోజులూ అక్కడే ఉండి ధ్యానం, నదీ యోగ వంటి కార్యక్రమాలు చేస్తారు. -
నాగసాధువులు వొంటినిండా విభూతి పట్టించుకుని చేత్తో త్రిశూలాలతోను, మానవ పుర్రెలతోను తమ మానాన తాము సాగిపోతుంటారు. జడలు కట్టిన పొడవాటి జుట్టుతో ఎముకలు కొరికే చలిలోనైనా నగ్నంగానే తిరుగుతుంటారు. చిలుము పీలుస్తూ మత్తులో ఉన్నట్లు కనిపిస్తుంటారు. తమ ఆధ్యాత్మిక పరిణామానికి తమ నగ్నత్వం కానీ, మత్తు పదార్థాల సేవనం కానీ అవరోధం కాదని వీరు త్రికరణశుద్ధిగా విశ్వసిస్తుంటారు. పైగా మృత్యువుకు ఏ కోశానా భయపడరు. ఎంతలా నగ్నంగా తిరుగుతున్నా సంయమనాన్ని ఏమాత్రం కోల్పోరు. ఒక సాధువు అన్నింటిని వదిలి ఆధ్యాత్మికత మార్గం వైపు తన జీవితాన్ని గడుపుతాడు. ఇక్కడ, ఆధ్యాత్మికత అంటే దేవుని శోధన లేదా విశ్వం యొక్క అంతిమ సత్యంను కనుగొనడంను సూచిస్తుంది. వారు నిజాన్ని కనుగొని దానిని జ్ఞానోదయంగా భావిస్తారు. ఇతరులు జ్ఞానోదయం కోసం పూజిస్తారు.

No comments