శ్రీకాంత్ పుస్తకంలో పవన్ సంచలన విషయాలు !



ఒకవ్యక్తి జీవితంపై 18 సంవత్సరాల పరిశోధన అంటే అది వినడానికీ ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ  అటువంటి అద్భుతం ఒక పవన్ వీరాభిమాని చేయబోతున్నాడు. ఈ సoచలనం చేస్తున్న వ్యక్తి పేరు శ్రీకాంత్. ఇతడు గత 18 సంవత్సరాలుగా పవన్ వ్యక్తిత్యం మరియు అతడి జీవితం పై చేసిన పరిశోధన పూర్తి కావడంతో అది త్వరలో పుస్తక రూపంగా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే పవన్ వీరాభిమానులు ‘పవనిజమ్' పేరుతో ఒక ఇజాన్ని సృష్టించి వెబ్ మీడియాయోలో ప్రచారం చేసిన నేపధ్యంలో  ఆవిషయాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్ళుతూ శ్రీకాంత్ ఈ పుస్తకాన్ని రాయడమే కాకుండా ఇప్పటివరకు చాలామందికి అర్ధం కాని పవన్ కళ్యాణ్ ఐడియాలజీకి అద్దం పట్టేలా ఈ పుస్తకంలో సమగ్రమైన వివరణ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 

పవన్ కళ్యాణ్ గురించి రీసెర్చ్ లో భాగంగా శ్రీకాంత్ పలుసార్లు పవన్ కళ్యాణ్ తండ్రి వెంకట్రావ్, తల్లి అంజనా దేవి, ఆయన సోదరులు చిరంజీవి, నాగబాబుతో సమావేశమై ఆయన గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నాడట. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల పుస్తకాల చదివినట్లు తన పరిశోధనలో వెల్లడి అయిందని ఈ రచియిత చేపుతున్నట్లు టాక్.

పవన్ కళ్యాణ్ ఆలోచనల పై రమణ మహర్షి ప్రభావంతో పాటు  ‘నీలో నువ్వు ప్రయాణించి నిన్ను నువ్వు తెలుసుకో’ అన్న రమణ మహర్షి మాటల ప్రభావం పవన్ పై ఎంతగా ఉంది అన్న విషయాన్ని ఈ పుస్తకంలో ఈ రచయిత వివరించాడు అని తెలుస్తోంది. ‘పవనిజమ్’ అనేది ఒక వ్యక్తిత్వ వికాస కార్యక్రమమో లేదా ఒక ఇజమ్ కాదు అని చెపుతూ ఈ రెండిటికన్నా భిన్నమైన సిద్దాంతం పవనిజమ్ అని నిరూపించాడట ఈ రచయిత.  ఈ పుస్తక రచన పూర్తి కావడంతో  అతిత్వరలో ఈ పుస్తకాన్ని విడుదచేసే ఉద్దేశంలో ఉన్నాడట శ్రీకాంత్..

source:apherald.com

No comments