బాహుబలిని డామినేట్ చేసిన సర్దార్ !
‘సర్దార్’ గా పవన్ షూటింగ్ స్పాట్ లోకి ఎంట్రీ ఇచ్చి పట్టుమని వారం గడవకుండానే చిత్రీకరణ కూడ పూర్తికాని ‘సర్దార్’ కు ఇరు రాష్ట్రాల బయ్యర్ల నుండి అప్పుడే వస్తున్న బిజినెస్ ఆఫర్లు ఈసినిమా నిర్మాత శరత్ మరార్ ను ఆశ్చర్య పరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘బాహుబలి’ సినిమా షూటింగ్ కు సంబంధించిన స్టిల్స్, టీజర్ లు విడుదల అయ్యాక ఆ సినిమా పట్ల బయ్యర్లు క్రేజ్ పెంచుకుంటే పవన్ కళ్యాణ్ ను వెనుక నుంచి చూపెడుతూ విడుదల చేసిన ఒకే ఒక్క స్టిల్ తో ఈసినిమాకు భారీ ఆఫర్లు రావడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.
‘బాహుబలి’ చిత్రానికి గ్రాఫిక్స్, వందల కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు పెట్టారు. అయితే అవేమీ లేకుండానే పవన్ 'సర్దార్'ని దాదాపు అదే రేంజ్‌లో కొనడానికి బయ్యర్లు మొగ్గు చూపెడుతున్న సమాచారం ఇప్పుడు ఫిలింనగర్ ను షేక్ చేస్తోంది. ‘గబ్బర్‌సింగ్’ చిత్రానికి ఉన్న క్రేజ్ తో ఆ సినిమాకు ‘సర్దార్’ సీక్వెల్ కాకపోయినా ఈసినిమాకు జనం వెర్రెత్తిపోయి వస్తారని అంచనాతో ఈ భారీ ఆఫర్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సంవత్సరం ‘గోపాల గోపాల’ సినిమాలో పవన్ సందడి చేసినా ఆ సందడి పవన్ అభిమానులకు పూర్తిగా సంతృప్తిని ఇవ్వలేదు. దీనితో పవన్ సోలో హీరోగా నటించే సినిమా కోసం పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. దీనితో ‘సర్దార్’ ఎప్పుడు విడుదలైనా భారీ ఓపెనింగ్స్ ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి. పవన్ పై ఉన్న మ్యానియాతో ఈ ఓపెనింగ్స్ ‘బాహుబలి’ స్థాయిలో ఉంటాయని ఫిలింనగర్ టాక్.
ఈ క్రేజ్ రీత్యా ఈసినిమాకు 85 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగేలాగుందని చెప్తున్నారు. ‘బాహుబలి’ తెలుగు వెర్షన్ వరకు 90 కోట్ల బిజినెస్ జరిగింది అన్న వార్తలు వచ్చాయి. కాని ఆ సినిమా బడ్జెట్ లో సగం కూడ ఖర్చులేని ‘సర్దార్’ కు ఈ రేంజ్ లో బయ్యర్ల నుండి అప్పుడే ఆఫర్లు రావడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/93007/IS-SARDAAR-IS-DOMINATING-BAHUBALI-/
Post a Comment