జపాన్… గొప్ప దేశం... ఎందువల్ల???
జపాన్… గొప్ప దేశం... ఎందువల్ల???
అతి చిన్న దేశమైనా… జపాన్ ప్రపంచంలో గొప్ప దేశాలలో ఒకటి కాగలిగింది? ఎందువల్ల???
ఇందువల్ల...
జపాన్లో ప్రతి పాఠశాలల్లో టీచర్లూ, విద్యార్థులూ కలిసి ప్రతిరోజూ ఒక పావుగంట వారి పాఠశాలల టాయిలెట్లను శుభ్రం చేస్తారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం బాలబాలికలు ఇక్కడినుంచే నేర్చుకుంటారు.
జపాన్లో పెంపుడు కుక్కలను బైటికి తీసుకు వచ్చేవారు ఒక సంచీని విధిగా తమ వెంట తీసుకువెళ్ళాలి. వారు తమ కుక్కలు విసర్జించిన దానిని ఆ సంచీలోకి ఎత్తివేస్తారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవడం అక్కడ ప్రతి ఒక్కరి బాధ్యతా.
పారిశుధ్యానికి సంబంధించిన ఉద్యోగస్తులను "హెల్త్ ఇంజనీర్లు"గా వ్యవహరిస్తారు. లిఖిత, మౌఖిక పరీక్షల ద్వారా వారిని ఉద్యోగాలలోకి ఎంపిక చేసుకుంటారు. వారి నెల జీతం ఐదు వేల నుండి ఎనిమిది వేల అమెరికన్ డాలర్ల వరకు ఉంటుంది.
జపాన్లో సహజ వనరుల కొరత తీవ్రంగా ఉంది. తరచుగా వచ్చే భూకంపాలు ఆదేశాన్ని అతలాకుతలం చేస్తుంటాయి. ఈ ఇబ్బందులేవీ కూడా ఆ దేశాన్ని ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్ధిక దేశంగా ఎదగకుండా నిరోధించలేకపోయాయి.
1945లో హీరోషీమా, నాగసాకి పట్టణాలపై అణుబాంబులతో దాడి జరిగింది. ఆ పట్టణాలు పూర్తిగా విధ్వంసం అయిపోయాయి. కానీ కొద్ది కాలంలోనే ఆ పట్టణాలు వెనకటి వైభవాన్ని సంతరించుకుని ప్రపంచ పటంపై సగర్వంగా నిలబడ్డాయి.
రైళ్ళలో, రెస్టారెంట్లలో, సమావేశ మందిరాలలో మొబైల్ ఫోన్ల వినియోగం నిషిద్ధం.
ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు ప్రతి విద్యార్థికి నైతిక ప్రవర్తన గురించిన బోధన ఉంటుంది.
ప్రపంచంలోని జపాన్ ప్రజలు సంపన్నులు. అయినా ఎవరి ఇంట్లోనూ పనివాళ్ళు కనిపించరు. ఇంటిలోని పెద్దవాళ్ళే ఇంటిపనులు చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం చేస్తుంటారు.
ప్రాధమిక స్థాయిలో 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు పిల్లలకి ఏ పరీక్షలూ ఉండవు. అక్కడి విద్యా విధానం లక్ష్యం పిల్లల్లో శీల నిర్మాణం గావించడం, వారికి చక్కని నడవడికను నేర్పించడం. పరీక్షలు, బట్టీ వేయించడం వారి పధ్ధతి కాదు.
జపాన్లో ఏ రెస్టారెంటుకి వెళ్ళినా అక్కడ తమకి కావలసినంటే వడ్డించుకుని తినడం చూస్తాం. అతిగా వడ్డించుకుని సగం సగం తిని మిగిలినది అవతల పారేయడం అక్కడ ఉండదు. అక్కడి ప్రజలు ఆహారాన్ని వృధా చేయడానికి ఇష్ట పడరు.
జపాన్లో రైళ్ళు సగటున ఏడాదికి 7 సెకన్లు ఆలస్యంగా నడుస్తాయి. సమయ పాలనకి వారు ఏంటో ప్రాధాన్యతనిస్తారు.
స్కూల్లో భోజనం చేసేక పిల్లలు తప్పనిసరిగా పళ్ళు శుభ్రంగా తోముకుంటారు. ఆరోగ్యాన్ని సరిగా చూసుకోవడం గురించి వారికి చిన్నప్పటి నుంచే శిక్షణనిస్తారు.
పాఠశాలల్లో చదివే బాలబాలికలకు మధ్యాహ్నం భోజనం తరువాత తప్పనిసరిగా అరగంట విశ్రాంతి ఇస్తారు, తిన్నది అరిగేందుకు. ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగితే "వారే కదా జపాన్ దేశపు భవిష్యత్తు" అని అక్కడి పెద్దల సమాధానం.
Post a Comment