RGV Tweet:పవన్ కళ్యాన్ డైరెక్షన్ చేస్తే చిరు 150వ సినిమా మరో బాహుబలి!


సంచలనానికి మారుపేరైన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఈ మద్య చిరంజీవి గురించి తెగ ట్వీట్స్ చేసేస్తున్నాడు. అవి పొగడ్తలో, వెటకారమో కుడా తెలియని విదంగా చేసేస్తున్నాడు.

తాజాగా రాం గోపాల్ వర్మ చేసిన ట్వీట్ చూస్తే అలానే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కనుక చిరంజీవి 150వ సినిమాకి దర్శకత్వం వహిస్తే అది బాహుబలి ని మించి పోతుంది అని ట్వీట్ చేశారు.

మొన్నటిదాకా చిరంజీవి 150వ సినిమా రాజమౌళి తప్పించి ఇంకెవ్వరు తీసినా అది ఫెయిల్ అయిపోతుంది అన్న వర్మ ఇప్పుడు పవన్ దర్శకత్వం , చరన్ ప్రొడక్షన్, చిరంజీవి నటన కలిస్తే అది మెగా బాహుబలి అవుతుందని అది మెగా అభిమానులకి పెద్ద పండుగ, కానుకలా అవుతుందని వివరించారు.

No comments