కొత్త వేదం

ఆయుష్, ప్రార్ధన ఇప్పుడు జహీర్ ఆలనలో ఉన్నారు. "వాళ్ళ మతానికి నేను అడ్డురాను, వాళ్ళు హిందువులుగానే పెరుగుతారు,దేవాలయానికి వెళతారు" అన్నారు జహీర్.
                   ఎడమ నల్ల దుస్తుల్లో కనిపిస్తున్న స్త్రీ జహీర్ సోదరి, కుడి పక్కన భార్య, కుమార్తె ముందు వరుసలోని బాలిక ప్రార్దన, బాలుడు ఆయుష్

చాలా సంవత్సరాల కిందట భారతీరాజా దర్శకత్వంలో ' జమదగ్ని '  అనే చిత్రంలో నటించాను.ఆ సందర్బంలో ఆయన తీసిన ఒక సినిమాని నాకు ప్రత్యేకంగా ప్రదర్శనని ఏర్పాటు చేశారు. చిత్రం పేరు ' వేదం పుదిదు ' (వేదం కొత్తది). స్థూలంగా కధ ఇది. ఊరి పెద్ద తక్కువ కులస్తుడు. అతని కారణంగా ఒక బ్రాహ్మణుడు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు.అతని కొడుకు 9 ఏళ్ళ పసివాడు.ఊరి పెద్ద భార్య ఆ పసివాడిని చేరదీసి సాకారు. అతన్ని బ్రాహ్మణుడిగానే పెంచారు.విద్యాబుద్దులకి గురువుల దగ్గరికి తేసుకెళ్ళరు.గురువుగారి వీధి అరుగు మీద కుర్రాడు వేదం చెప్పుకుంతుంతే దూరాన చెత్తుకింద గొంతికిలా కూర్చుని ఉండే వాడు ఊరి పెద్ద. ఊరి పెద్ద అంతే అందరికీ సింహస్వప్నం. కాని కుర్రడికి తన అజ్ఞాానం కారణంగా, కులం కారణంగా నష్టం కలగకుండా అప్రమత్తంగా పెంచే పెద్ద దిక్కు. కుర్రాడు వేదపండితుడయ్యాడు. తనను పెంచిన దంపతుల మీద ఆత్మీయత పెంచుకున్నాడు. ఊరి పెద్ద కన్నుమూశాడు. కుర్రాడు శాస్రోక్తంగా తండ్రికి చేసినట్టు అంత్యక్రియలు జరిపాడు. విద్య సంస్కారాన్ని నేర్పింది. బాంధవ్యం రుణం తీర్చుకుంది. ఇది కొత్త వేదం అన్నరు రచయిత, దర్శకుదు భారతీరాజా.

ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక - బెంగాలులో మతకల్లొలం పెచ్చురేగింది. మహాత్ముడు నిరాహారదీక్ష చేస్తున్నడు.ఒక హిందువు వచ్చి " నేను ఒక ముస్లిం కుర్రాడి తల గోడకి కొట్టి చంపాను బాపూ" అని నిస్సహాయంగా చెప్పుకున్నాడు.బాపూజీ అతన్ని చూసి "దానికి ప్రాయశ్చిత్తం ఉంది. ఓ చిన్న కుర్రాడిని చేరదీసి పెంచు. అయితే అతను ముస్లిం కుర్రాడయి ఉండాలి. అతన్ని ముస్లింగానే పెంచాలి" అన్నాడు. మానవత్వానికి మతం లేదు. కులం లేదు. వివక్ష లేదు.

ఇప్పుదు ఎటీవలి కధ. మహ్మద్ షానవాజ్ జహీర్, ప్రవీన్ దయాళ్ ఇద్దరూ పైలట్లు. కలసి పనిచేస్తున్నరు.ఆత్మీయ మిత్రులయ్యారు. ప్రవీణ్ ఒక ఎయిర్ హోస్టెస్ ని పెళ్ళి చేసుకున్నడు. ఇద్దరు కవల పిల్లలు పుట్టారు - ఆయుష్, ప్రార్దన. 2012లో ఆమె కన్నుమూసింది. అతనూ అనారోగ్యంలో పడ్డాడు. "నాకేమైనా అయితే నా పిల్లలని చూసుకోండి" అని ప్రవీణ్ మిత్రుడు జహీర్ దగ్గర మాట తీసుకున్నాడు. తర్వాత ఆ సంవత్సరమే అతనూ కన్నుమూశాడు. జహీర్ వెంటనే చొరవ తీసుకోని కారణన పిల్లలని కారు ద్రైవర్ సాకుతున్నాడు. తన ఉద్యోగం రద్దీలో మిత్రుడికిచ్చిన మాటని మరిచిపోయాదు జహీర్. ఒక రోజు పిల్లలు ఇద్దరూ అతనికి ఫోన్ చేశారు, కంటతడిపెట్టుకుంటూ, జహీర్ గతుక్కుమన్నాడు. వెంటనే రంగంలోకి దూకాడు.ప్రవీణ్ పోయాక ఇండియన్ పైలట్ల అసోసియేషన్ ఒక కోటి రూపాయలు సమీకరించి - పిల్లల పేరిట బ్యాంక్ లో వేసింది. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులూ, పిల్లల బాధ్యత తనకే అప్పగించాలని కోర్టును ఆశ్రయించాడు.

అయితే ఈ అనుమతికి కొన్ని పరధులున్నాయి. తను ముస్లిం. పిల్లలు హిందువులు. భారత దేశపు చరిత్రలో ఇంతవరకూ మతాంతర ఒప్పందానికి ఏ కోర్టూ అనుమతి ఇవ్వలేదు. అయినా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నజ్మీ వజీరీ(గమనించాలి - ఇతను ముస్లిం) ఈ పిల్లల పోషణా భారాన్ని జహీర్ కి అప్పగించారు. ఆయన తీర్పులో మాటలు "వివిధ సాహిత్యాలలో కవులూ, రచయితలూ మానవ సంబంధాలు మతాతీతమైనవని పేర్కొన్నారు.

మానవ శ్రేయస్సుకి మూలసూత్రం పసి జీవితాలను కాపాడటమే". నీదా ఫ్లజీ, జావేద్ అఖ్తర్ మాతలని ఉదహరిస్తూ "అనాధ పుల్లలను సంరక్షించి, సాకడం అపూర్వమైన మానవధర్మాలలో ఒకటి" అన్నారు. పక్కింటి వ్యక్తి అరుణ్ సాయనీకి ఆ పిల్లలిద్దర్నీ జహీర్ హిందూ సాంప్రదాయ రీతుల్లో పెంచుతున్నట్టు పర్యవేక్షించే పనిని అప్పగించారు న్యాయమూర్తి. యోగేష్ జోగియా అనే న్యాయవాది ఈ కేసుని ఉచితంగా నిర్వహించారు. భారతదేశంలో మతాతీతమైన గొప్ప తీర్పుగా దీనిని అభివర్ణించారు. 

ఆయుష్, ప్రార్ధన ఇప్పుడు జహీర్ ఆలనలో ఉన్నరు. "వాళ్ళ మతానికి నేను అడ్డురాను.వాళ్ళు హిందువులుగానే పెరుగుతారు. దేవాలయానికి వెళతారు" అన్నారు జహీర్. ఆయుష్ పబ్లిక్ స్కూలులో చదువుతున్నాడు. పెద్దయ్యాక ఏమవుతాడు? పైలట్ని అవుతానన్నాడు. ప్రార్ధన డిజైనర్ అవుతానన్నది. 

కాలం మారుతోంది. మానవ సంబంధాలకు ఉదాత్తమయిన విలువలు జత అవుతున్నాయి. 'కొత్త వేదం' కొత్తగా గొప్పగా నిలదొక్కుకుంటోంది.

ఆనాడు మహాత్ముడు చెప్పింది నీతి. ఈనాడు జహీర్ పాటించింది. నియతి.వెరసి మానవ సమాజానికి కరదీపిక కాగలిగిన - నిఖార్సయిన మానవత్వం.
                                                             --  సాక్షి జీవన కాలం
                                                                                                గొల్లపూడి మారుతీరావు

Click on Below Image/open in new tab for Full View




No comments