పవన్ అలా ఎందుకు చేసాడు ?

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘గబ్బర్ సింగ్ 2’ షూటింగ్ ఎట్టకేలకు మొదలై కొన్ని రోజులు నడిచింది అని ఆనంద పడుతున్న సమయంలో వారి ఆనందం పై ఒక రూమర్ వారిని నిరాశకు గురి చేసింది అనే వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రలో పూణే దగ్గర పడమటి కనుమలలో జరుపుకున్న షూటింగ్ కేవలం తన అభిమానుల టెన్షన్ ను తగ్గించడానికి ఒక అస్త్రంగా మాత్రమే పవన్ వ్యూహాత్మకంగా ఉపయోగించాడు అనే గాసిప్పులు గట్టిగా వినిపిస్తున్నాయి.

దీనికి కారణం ఈ సినిమా మొదటి షెడ్యూల్ పవన్ లేకుండానే జరగడమే కాకుండా ఈ సినిమా రెండవ షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుందో ఈ సినిమా యూనిట్ కు కూడ తెలియని అయోమయ స్థితిలో ఉందని టాక్. ఈ పరిస్థుతులు ఇలా ఏర్పడటానికి ప్రధాన కారణం ఈ సినిమా కథ విషయంలో ఇప్పటకీ  పవన్ కు ఒక క్లారిటీ లేకపోవడంతో పవన్ ఈ సినిమా రెండవ షెడ్యూల్ ను ఎప్పుడు మొదలు పెడతాడు అన్న విషయమై అనేక అనుమానాలు ఉన్నాయి ని అంటున్నారు.

ఈమధ్య కాలంలో టాలీవుడ్ లో విడుదలైన సీక్వెల్ సినిమాలు అన్నీ పరాజయం చెందడంతో ‘గబ్బర్ సింగ్ 2’ ను ఒక సీక్వెల్ గా కాకుండా పూర్తిగా ఒక కొత్త సినిమా కథ చూసినట్లుగా ఉండాలి అన్న భావంతో పవన్ ఈ సినిమా కథకు సంబంధించిన పాత్రల స్వరూపం పూర్తిగా మార్పులు చేస్తూ ఉండటంతో  ‘గబ్బర్ సింగ్ 2’ రెండవ షెడ్యూల్ ప్రారంభం పై క్లారిటీ లేకపోయినా కేవలం తన అభిమానులు ఖంగారు పడకుండా ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను ఒక మొక్కుబడిగా లాగించి వేసారు అని టాక్. 

దీనికితోడు ఈ సినిమా టైటిల్ ‘సర్దార్’ గా మారుతుంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో మళ్ళీ పవన్ ‘గబ్బర్ సింగ్ 2’ విరామం తీసుకుంటుంది అనే వార్తలు ఫిలింనగర్ లో సందడి చేస్తున్నాయి. అటు సినిమాలలోను ఇటు రాజకీయాలలోనూ పవన్ అనుసరిస్తున్న ఈ అయోమయ ధోరణి పవర్ స్టార్ ను పవర్ లెస్ స్టార్ గా మార్చాయి అంటూ సెటైర్లు పడుతున్నాయి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/88936/WHY-PAVAN-BEHAVED-LIKE-THIS-/

No comments