సల్మాన్ అభిమానులకు షాక్ ఇచ్చిన పవన్ అభిమానులు !

ఈమధ్యనే తాత్కాలికంగా కోర్టు కేసుల నుండి బయటపడి తిరిగి తన సినిమాలను వేగంగా సల్మాన్ ఖాన్ పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సల్మాన్ అభిమానులకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక విషయమై చేస్తున్న ఆశ్చర్యకరమైన ప్రచారం సల్మాన్ అభిమానులకు షాక్ ఇస్తోంది అని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం పవన్ అభిమానులు తమ అభిమాన పవర్ స్టార్ గెటప్ ను సల్మాన్ కాపీ కొట్టాడు అంటూ వెబ్ మీడియాలో చేస్తున్న ఒక వింత ప్రచారo.

ఇక వివరాలలోకి వెళితే సల్మాన్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘భజరంగి బహిజన్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ గతంలో పవన్ కళ్యాణ్ నటించి 2003లో విడుదలైన ‘జాని’ సినిమాలోని పవన్ లుక్ ను పోలి ఉంది అంటూ కామెంట్స్ చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ లుక్ ను సల్మాన్ ఖాన్ కాపీ కొట్టాడు అంటూ వెబ్ మీడియాలో పవన్ అభిమానులు సల్మాన్ పై సెటైర్లు వేస్తున్నారు.

అయితే ఈ రెండు సినిమాల హీరోల లుక్స్ ను నిశితంగా పరిశీలిస్తే గెడ్డం విషయంలో సల్మాన్ పవన్ లుక్ ను అనుకోకుండా అనుసరించినట్లు కనిపించినా కొన్ని స్పష్టమైన తేడాలు తెలుస్తూనే ఉన్నాయి. సల్మాన్ ‘భజరంగి బహిజన్’ ఫస్ట్ లుక్ లో సల్మాన్ మెడలో ఒక పెండెంట్ కనిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో సల్మాన్ ఆoజనీయ స్వామి భక్తుడిగా కనిపించ బోతున్నాడు. అందుకే ఈ సినిమాను ఎక్కువ భాగం కాశ్మీర్ లో నిర్మించారు.

కానీ ‘జానీ’ సినిమాలో మాత్రం పవన్ బాక్సర్ గా కనిపించిన విషయం  తెలిసిందే. అయితే అనుసరణ వేరు కాపీ చేయడం వేరు అనే సిద్దాంతం ప్రకారం అనుకోకుండా సల్మాన్ లుక్ పవన్ లుక్ ను పోలి ఉన్నంతలో ఏకంగా సల్మాన్ పవన్ లుక్ ను కాపీ కొట్టాడు అంటూ వెబ్ మీడియాలో హడావిడి చేయడం పవన్ అభిమానుల మితిమీరిన ఉత్సాహం అనుకోవాలి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/88313/SALMAN-FANS-GOT-SHOCK-FROM-PAVAN-FANS/


No comments