పవన్ భార్య పై రేణు దేశాయ్ కామెంట్స్ !


పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ నిన్న తన ట్విటర్ లో పవన్ ప్రస్తుత భార్య పై చేసిన కామెంట్స్ కు సంబంధించిన వార్తను ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ప్రచురించింది. సొనాలి అనే అభిమాని రేణుతో నిన్న చాటింగ్ చేస్తూ అడిగిన ఒక టీజింగ్ ప్రశ్నకు రేణు దేశాయ్ చాల తెలివిగా సమాధానం ఇచ్చింది. 

తాను ప్రస్తుతం తన పిల్లలతో పూణే లో కాలం గడుపుతున్నానని అయితే కొంతమంది తనను పవన్ దగ్గరకు వెళ్ళవచ్చు కదా అని సలహాలు ఇస్తూ ఉంటారని కాని పవన్ ప్రస్తుతం ఒక మహిళను పెళ్ళి చేసుకోవడమే కాకుండా ఆమెకు ఒక పాప కూడ ఉన్న నేపధ్యంలో వారి మధ్యకు వెళ్ళి వారికి అసౌకర్యం కలిగించడం తనకు ఇష్టంలేదని కామెంట్స్ చేసింది రేణు. 

అంతేకాదు పవన్ ప్రస్తుత భార్య కుమార్తె కూడా పవన్ అభిమానాన్ని ఆశిస్తుంది కదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా ఈ సందర్భంలో మరో కామెంట్ చేస్తూ ఈమధ్య తన కొడుకు అకిరా తన స్కూల్ లో జరిగిన ఒక పోటీకి హాజరు అవుతూ గెలుపు ఓటమి కన్నా పోటీలో పాల్గొనడం ముఖ్యం అన్న తన కొడుకు అకిరా మాటలు విన్న తరువాత అటువంటి పిల్లలు తనకు ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నాను అంటూ కమెంట్స్ చేసింది రేణు. 

అయితే పవన్ ప్రస్తుతం తన భార్యతో కలిసి ఉన్నా భవిష్యత్ లో తాను కావాలని పవన్ కోరుకుంటే పవన్ దగ్గరకు వెళతానేమో తనకు తెలియదనీ అంత వరకు తనను ప్రశ్నలతో విసిగించ వద్దని రేణు నిన్న తనను ప్రశ్నించిన అభిమానికి గట్టి క్లాస్ పీకింది రేణు. అయితే పవన్ ‘గబ్బర్ సింగ్ 2’ షూటింగ్ నిమిత్తం పూణే చుట్టు పక్కల ప్రాంతాలలో ఉంటున్నాడు కాబట్టి రేణు పిల్లలు పవన్ ను కలుస్తారా అన్నది ఊహకందని ప్రశ్న.
source:http://www.apherald.com/Movies/ViewArticle/88255/RENUDESAI-COMMENTS-ON-PAVAN-WIFE/

No comments