చిరంజీవి పవన్ లపై పేటెంట్ హక్కులు ప్రకటించుకున్న హరికృష్ణ !
మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లపై వారి అభిమానులకు విపరీతమైన ప్రేమ ఉంటుంది అన్న విషయం సర్వసాధారణమే అయినా ఏకంగా చిరూ పవన్ లపై తనకు పేటెంట్ హక్కు ఉంది అంటూ ఈ మెగా హీరోల వీరాభిమాని మీడియాకు ఎక్కడం ఈరోజు టాక్ ఆఫ్ ది డేగా మారింది.
చిరంజీవి పవన్ ల పక్కన ఒక ఫోటో తీయించుకుంటే చాలు అని ఒక సగటు అభిమాని భావిస్తే చిరంజీవి పవన్ ల సినిమాలలో వారితో కలిసి నటించాలని చాలామంది నటులు అదేవిధంగా వారి సినిమాలకు కథలు వ్రాయాలని చాలామంది ఔత్సాహిక రచయితలు ఆశ పడుతూ ఉంటారు. అయితే టాలీవుడ్ ఎంపరర్ లుగా ఎదిగిపోయిన వీరిని ఎలా కాలవలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు.
అయితే ఇప్పుడు అటువంటి వారి కోసం ఒక సంస్థను ఏర్పాటు చేసి వారిని కలిసి తమ కథలను వినిపించడానికి పవన్ చిరంజీవిల వీరాభిమాని రచయిత హరికృష్ణ ఒక సంస్థను ఏర్పాటు చేసాడు అనే వార్తలు వస్తున్నాయి. ‘మెగా ఫ్యాన్స్ స్టార్ ఫ్రెండ్స్ సర్కిల్’ అన్న పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసిన ఈ వీరాభిమాని హరికృష్ణ తమ వద్ద పవన్ కళ్యాణ్ చిరంజీవిలకు సరిపడే కథలు ఉన్నాయి అని అంటున్నాడని టాక్.
అంతేకాదు ఈ వీరాభిమాని సోమాజీగుడాలోని ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి తన సంస్థ ఆశయాలను వివరించాడని తెలుస్తోంది. చిరంజీవి పవన్ కళ్యాణ్ లపై ఉన్న వీరాభిమనంతో ఇప్పటి వరకు తాను చిరంజీవి పవన్ లపై ఉన్న అభిమానంతో 100 కిలోమీటర్లు పరిగెత్తడంతో పాటు 150 సార్లు రక్తదానం చేశాను అంటూ ప్రకటించడమే కాకుండా చిరజీవి స్ఫూర్తితో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల కోసం ప్రత్యేకంగా తాను వ్రాసిన సందేశాత్మకమైన కథలను చదివి ఆ కథలలో చిరంజీవి పవన్ లు నటించాలని అభ్యర్ధించాడు అన్న వార్తలు వస్తున్నాయి. అంతేకాదు వారిద్దరి పై తనకు పేటెంట్ హక్కు ఉంది అంటూ హరికృష్ణ చేసిన ప్రకటన మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/88818/HARIKRISHNA-PATENT-RIGHT-ON-CHIRU-AND-PAVAN/

Post a Comment