పూరి ట్విస్ట్ తో షాక్ అయిన చిరంజీవి !


మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించాలనిఎందరో దర్శకులు ప్రయత్నించినా అందరి ఊహాలను తలక్రిందులు చేస్తూ పూరీజగన్నాథ్ ఈ అవకాసం మెగా కాంపౌండ్ నుండి కొట్టేయడంతో పూరీజగన్నాథ్ అంత అదృష్ట వంతుడు మరెవ్వరూ ఉండరు అని అనుకున్నారు అంతా. రాబోయే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తాను అని అధికారికంగా చెప్పిన పూరి ఈ మెగా సినిమా మధ్యలో నితిన్ తో ప్రేక్షకులకు మరో హార్ట్ ఎటాక్ తెప్పించడానికి ముహూర్తం ఫైనల్ చేసాడు.

ఇప్పటి దాకా ఫిలింనగర్ లో వినిపించిన గాసిప్పులను నిజం చేస్తూ పూరీజగన్నాథ్ నితిన్ ల కొత్త సినిమా ఈనెల 15వ తారీఖు నుండి మొదలవుతుంది అని అధికారికంగా నితిన్ ప్రకటించడంతో ఆగష్టులో మొదలయ్యే చిరంజీవి 150వ సినిమాకన్నా ముందుగానే నితిన్ సినిమాను మొదలు పెట్టి సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేస్తాను అని చెపుతున్నాడు పూరి.

అయితే చిరంజీవి నటించబోయే ‘ఆటో జానీ’ స్క్రిప్ట్ ఇంకా పూర్తికాని నేపధ్యంలో మధ్యలో ఈ నితిన్ సినిమా హడావిడి ఏమిటి అని మెగా అభిమానులు కలవర పడుతున్నారు అనే అంశం చిరంజీవి దృష్టి వరకు వెళ్ళింది అని టాక్. లండన్ విహార యాత్ర నుండి ఇప్పుడే దిగిన చిరంజీవికి పూరీజగన్నాథ్ నితిన్ ల సినిమా ప్రకటన ఒక విధంగా షాకింగ్ న్యూస్ అనుకోవాలి.

అయితే ఇప్పటికే చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి దర్శకుడిగా పూరి పేరు అధికారికంగా ప్రకటించబడిన నేపధ్యంలో చిరంజీవికి పూరీతో సద్దుబాటు చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఏది ఎలా ఉన్నా పూరీజగన్నాథ్ నితిన్ ల లేటెస్ట్ సినిమా వ్యవహారం చిరంజీవికి బయటపడని షాక్ అనుకోవాలి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/88349/CHIRANGEEVI-GOT-SHOCKED-WITH-PURI-TWIST/

No comments