బాహుబలి ఆడియో ఫంక్షన్ స్వీట్ న్యూస్ !

ఇప్పటికే ఎన్నో మలుపులు తీసుకుని వాయిదా పడిన ‘బాహుబలి’ ఆడియో ఫంక్షన్ కు సంబంధించిన లేటెస్ట్ స్వీట్ న్యూస్ ప్రభాస్ అభిమానులను ఆనందంలో ముంచెత్తి వేస్తోంది. గత కొద్ది రోజులుగా దిగాలు పడ్డ ప్రభాస్ అభిమానులు ఈ లేటెస్ట్ న్యూస్ వినగానే తిరిగి ఉత్సాహాన్ని పుంజుకున్నారు.

ఫిలింనగర్ లో వినపడుతున్న సమాచారం ప్రకారం ‘బాహుబలి’ ఆడియో వేడుకకు మరో లేటెస్ట్ డేట్ ను రాజమౌళి ఫిక్స్ చేసాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ ఆడియో ఫంక్షన్ ఈసారి ఈనెల జూన్ 10వ తారీఖున రామోజీ ఫిలింసిటీలో నిర్వహించాలని ఏర్పాట్లు మొదలు పెట్టినట్లు టాక్. అయితే ఈసారి రామోజీ ఫిలిం సిటీని వేదికగా నిర్ణయించడానికి ఒక కారణం ఉంది అని అంటున్నారు. 

రామోజీ ఫిలిం సిటీలో ఈ ఆడియో ఫంక్షన్ జరిగితే ఎంతమంది వచ్చినా మేనేజ్ చేయొచ్చని రాజమౌళి ఆలోచనా అని తెలుస్తోంది. అంతేకాకుండా పాస్ లేనివాళ్లు లోప‌ల‌కు చొర‌బ‌డే అవ‌కాశాలు కూడ ఉండవు. ఈ కారణాల రీత్యానే రామోజీ ఫిల్మ్‌సిటీ సేఫ్ అనే నిర్ణయానికి ఈ సినిమా యూనిట్ వచ్చిందని తెలుస్తోంది.

ఇప్పటికే ఫిల్మ్‌సిటీలో ఏర్పాట్లు మొద‌లైపోయాయి అనే వార్తలు కూడా వస్తున్నాయి. అక్కడ భారీ సెట్టింగులు కూడ రెడీ అవుతున్నాయట. ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన ఒక రెండు రోజులలో స్వయంగా రాజమౌళి చేస్తాడని టాక్. మరి ఈ డేట్ అయినా ‘బాహుబలి’ ఆడియో విషయంలో అధికారికంగా నిలబడి ఆడియో ఫంక్షన్ జరుగుతుందా? లేదా? అన్నది సందేహమే.
source:http://www.apherald.com/Movies/ViewArticle/88482/BAHUBALI-AUDIO-FUNCTION-SWEET-NEWS/

No comments