సైమాలో మెగాస్టార్..డాన్స్ షో!
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్.. సౌత్ లోని నాలుగు భాషలను ఓ చోట కలిసేలా భారీ స్థాయిలో ఏర్పాటు చేసే ఈ క్రార్యక్రమం లాస్ట్ ఇయర్ హైదరాబాద్ లో జరిగింది. ఇప్పుడు ఆ ప్రోగ్రాం సింగపూర్ లో జరుగనుంది. నాలుగు భాషలకు సంబందించిన సెలబ్రిటీస్ ఈ వేడుకలో పాల్గొననున్నారు. అయితే స్పెషల్ ఎట్రాక్షన్ మాత్రం మెగాస్టార్ చిరంజీవి అంటున్నారు నిర్వాహకులు.
కొద్దిపాటి గ్యాప్ తర్వాత మెగాస్టార్ మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటున్నాడు. అయితే ఈ టైంలో తన క్రేజ్ తిరిగి సంపాదించేందుకు సైమా అవార్డుల్లో మెగాస్టార్ చిరు సందడి చేయనున్నారని తెలుస్తుంది. మరి హోస్ట్ గా ఉంటారా లేక ఓ డ్యాన్స్ బిట్ వేస్తారా అన్నది తెలియదు కాని చిరు మాత్రం ఈసారి సైమాలో స్పెషల్ అవుతాడంటున్నారు.
ఇక సౌత్ భాషలన్ని ఒకే చోట కలుస్తాయి కాబట్టి ఈ ఈవెంట్ తో ఇంట్రడ్యూస్ అయితే మళ్లీ తన స్టామినా తెలిసే అవకాశం ఉంటుందనే ఆలోచనతో కూడా ఈ ఏర్పాట్లకు ఓకే చెప్పాడట చిరు. ఇక చిరు కాకుండా అల్లు అర్జున్, శిరీష్ లు మాత్రమే ఈ ఈవెంట్ లో పాల్గొనే అవకాశాలున్నాయి. ఎందుకంటే చరణ్ ధృవ, వరుణ్ తేజ్ శ్రీనువైట్ల సినిమా, సాయి ధరం తేజ్ తిక్క సినిమాలతో బిజీ షూట్లో ఉన్నారు. సో అందుకే ఈవెంట్ కు మెగాస్టార్, అల్లు సోదరులు మాత్రమే వెళ్తున్నారట.
జూన్ 30, జూలై 1న జరుగనున్న ఈ ఈవెంట్ ఆటపాటలతో.. హుశారెత్తినేందుకు ఆల్రెడీ పలు డ్యాస్ ట్రూపులు రిహాల్సెల్స్ చేస్తున్నాయి కూడా. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అంతా సైమా వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంది.
Post a Comment