రష్మీ పై సన్నీలియోన్‌ సెటైర్లు !


రష్మీ తెలుగు సినిమా రంగంలో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చినా  ఆమెకు అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరపై ‘యువ’ అనే సీరియల్‌లో చాన్నాళ్ళ క్రితమే నటించింది. టీవీ షోలతో కాలక్షేపం చేస్తూ అప్పుడప్పుడు  సినిమాల్లో నటిస్తున్న ఈమె ‘జబర్దస్త్’ లోకి అడుగు పెట్టాక రష్మి ఫేట్ అమాంతం మారిపోయింది. 

ఏకంగా ‘గుంటూర్ టాకీస్’ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా మరీ హిట్ కాకపోయినా  టాలీవుడ్ హాట్ గాళ్ గా రష్మీకి ఇమేజ్ వచ్చేసింది. ఈ నేపధ్యంలో ఈమె లేటెస్ట్ గా నటిస్తున్న ‘అంతం’  ట్రైలర్ లో ఈమె చేసిన ఓవర్ ఎక్స్ పోజింగ్ ను  చూసి ఆమెకు టాలీవుడ్ సన్నీ లియోన్ గా విశ్లేషకులు టైటిల్ ఇచ్చేసారు. 

ఇటీవల విడుద చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు ఆ తరువాత విడుదల అయిన ట్రైలర్ కు యూత్ నుంచి  వస్తున్న స్పందనను చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం "A" సర్టిఫికేట్ పొందటంతో రష్మి  A  సర్టిఫికేట్ సినిమాలకు చిరునామాగా మారిపోయిందా అంటూ సెటైర్లు పడుతున్నాయి.  

అంతేకాదు బాలీవుడ్‌లో వస్తున్న అడల్ట్‌ థ్రిల్లర్‌ తరహా సినిమాల్ని టాలీవుడ్‌లో తెరకెక్కించాలనుకునేవారికి రష్మీ బెస్ట్‌ ఆప్షన్‌ గా మారిపోయింది అనే కామెంట్స్ కుడా వినిపిస్తున్నాయి.  దీనికితోడు అందాల ఆరబోతలో రష్మీ ఏమాత్రం మొహమాటపడకపోవడం కూడ ఆమెకు కలిసివస్తోంది అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా రష్మి ఓవర్ ఎక్స్ పోజింగ్ ను చూసి చాలా మంది హీరోయిన్స్ కూడ అదిరి పోతున్నారు టాక్..  

No comments