ఎన్టీఆర్‌ మిస్సైన 7 సూపర్ హిట్లు ఇవే


యంగ్ టైగర్ సినిమా అంటేనే ఫ్యాన్స్ లో సూపర్ క్రేజ్.. హీరోయిజాన్ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్ళేలా చేయగల సమర్ధ నటుడు నందమూరి తారక రామారావు. తాత ఆశీస్సులతో స్టార్ హీరోగా ఎదిగిన యంగ్ టైగర్ తీసే సినిమాలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎన్టీఆర్‌ దగ్గరకు వచ్చిన సినిమాల కథలని లైట్ తీసుకుని వదిలేశాడు. వదిలేసిన ఆ సినిమాలే బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యి బాక్సాఫీస్ ని షేక్ చేశాయి.

సాధారణంగా సినిమా కథలో క్యారక్టరైజేషన్ నచ్చకో, ఇమేజ్ దృష్ట్యా సినిమా తమకు నప్పదనే ఆలోచనతో కొందరు హీరోలు సినిమాలను వదులుకోవడం మాములే. స్టార్ హీరోల దగ్గర నుండి చిన్న హీరోల దాకా ఇది కొనసాగుతూనే ఉంది. కొంతమంది హీరోలైతే కథ నచ్చినా డేట్స్‌ అడ్జెస్ట్ చేయలేక వదిలిన సందర్భాలు ఉన్నాయి. అలా నో చెప్పిన కథలు వేరే హీరోలు చేసి సక్సెస్‌ కొడితే ఆ హీరో పడే బాధ అంతా ఇంతా కాదు. అయితే అలాంటి బాధను ఎన్టీఆర్‌ తన కెరీర్‌లో ఏడు సార్లు అనుభవించే పరిస్థితి వచ్చిందట.

కెరీర్‌ ఆరంభం నుండి స్టోరీల పరంగా బాగా ఆలోచించి స్టెప్ వేసే ఎన్టీఆర్‌, కొన్ని సినిమా కథలు నచ్చక నో చెప్పిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఎన్టీఆర్‌ నో చెప్పిన దాదాపు 7 కథలు వేరే హీరోలు చేసి సూపర్ సక్సెస్‌ను సాదించుకున్నారు. నితిన్‌ నటించిన ‘దిల్‌’ సినిమా నుండి మొదలు పెడితే రీసెంట్ గా విడుదలై సూపర్ హిట్టైన ‘శ్రీమంతుడు’ వరకు ఎన్టీఆర్‌ నో చెప్పబట్టే వేరే హీరోల దగ్గరకు వెళ్ళాయన్న న్యూస్ ఫిల్మ్ నగర్లో చెక్కర్లు కొడుతుంది.

ఎన్టీఆర్‌ కాదని చెప్పిన ఏడు హిట్‌ సినిమాలు ఏంటంటే.. దిల్‌ (నితిన్‌)-వినాయక్‌ (దర్శకుడు), ఆర్య (అల్లు అర్జున్‌)-సుకుమార్‌, భద్ర(రవితేజ)-బోయపాటి శ్రీను, అతనొక్కడే(కళ్యాణ్‌ రామ్‌)-సురేందర్‌ రెడ్డి, కిక్‌(రవితేజ)-సురేందర్‌ రెడ్డి, కృష్ణ(రవితేజ)-వినాయక్‌, శ్రీమంతుడు(మహేష్‌బాబు)-కొరటాల శివ.

ఒకవేళ ఈ సినిమాలు కూడా ఎన్టీఆర్‌ చేసి ఉంటే నందమూరి ఫ్యాన్స్‌ పండుగ చేసుకుని ఉండేవారు. కెరియర్ పరంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్‌కు లాస్ట్ రిలీజ్ టెంపర్ కాస్త ఊరట నిచ్చినా ఎన్టీఆర్‌ రేంజ్ హిట్ అందుకునే టైం ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అందరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ ఇవి వదులుకోవడం వలన ఆయన క్రేజ్ కేమీ నష్టం కలగకపోయినా ఇవి కూడా చేసి ఉంటే టాప్ త్రీ హీరోల్లో ఉండే ఛాన్స్ ఉండేదని అనుకుంటున్నారు.

source;apherald.com

No comments