NASA: భూమిని పోలిన మరో పెద్ద భూమి ఉందని నిర్ధారణ!(Cousin of the Earth)



మనిషి జీవించడానికి వివిధ గ్రహాలపై అనేక పరిసోదనలు జరుగుతూనే ఉన్నయి.మన భూమి లాంటిది మరొకటి ఉందని కొందరు లేదని కొందరు చర్చలు చాలానే వచ్చాయి.

అయితే తాజాగా నాసా చేసిన అనేక పరిసోధనల్లో ఒక నిజం వెలువడింది. అదేమిటంటే మన భూమిని పోలిన ఇంకొక భూమి ఉందని నాసా(NASA) అధికారికంగా ప్రకటించింది.

భూమి పోలిన ఈ కొత్త భూమికి ' కెప్లర్-452బి ' అని పేరు కూడా పెట్టారు. ఇది కూడా భూమి లాగానే ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతుంటుందని నిర్ధారించారు.

ఇంకా ఈ గ్రహం 1400 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని, భూమిలాగానే సూర్యుని లాంటి ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతుంటుందని పేర్కొన్నారు.ఇది భూపరిణామంతో పోలిస్తే 60% పెద్దదని వివరించారు.

ఈ గ్రహం పై ఉండే వాతావరణ వివరాలు అంతగా తెలియకపోయినా, రాళ్ళ తో నిండి, భూమికంటే అయిదు రెట్లు ద్రవ్యరాశిని కలిగి ఉండొచు అని నాసా(NASA) పేర్కొంది.

ఇంకా సంవత్సరానికి రోజులు కూడా భూమితో పోలిస్తే ఎక్కువా ఉంటాయట. సంవత్సరానికి 385 రోజులు ఉంటాయని తెలిపింది.

ఈ గ్రహం పై మానవ నివాసానికి మనుగడకి అనుకూలమా లేదా అని ఇంకా ఖచ్చితంగా తెలపలేమని, ఇది భూమి కన్నా 1.5 బిలియన్ సంవత్సరాల ముందు నుండే ఉండవచ్చు అని తెలిపింది.

అయితే జీవం మనుగడని సాగించవచ్చు అని భావిస్తున్న గోల్డిలాక్స్ ప్రాంతంలోనే ఈ గ్రహం ఉండటాన్ని నాసా(NASA) ప్రత్యేకంగా పేర్కొంది.

No comments