పవన్ సినిమాలో ప్రిన్స్ మహేష్ గెస్ట్ రోల్..?!!

తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్, ప్రిన్స్ మహేష్ బాబు మంచి హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు, అంతే కాదు నెంబర్ వన్ స్థానానికి ఇద్దరూ పోటీలో ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కాంబినేషన్ సూపర్ హిట్ అని అందరీకీ తెలుసు వీరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది లాంటివి సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది అదే ‘కోబలి’. ఈ సినిమాకు ప్రిన్ మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తారని వార్తలు వచ్చాయి. అంతే కాదు మరో ట్విస్టు ఏంటంటే ఈ సినమాలో మహేష్ బాబు ఓ గెస్టు పాత్రలో కనిపిస్తారట. ఈ ముగ్గురు కాంబినేషన్ లో సినిమా వస్తే తెలుగు ప్రేక్షకులకు పండగే కదా.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ ఇద్దరు హీరోలకు మంచి స్నేహితుడు ఇద్దరికీ మంచి హిట్ లు అందించారు. ఆ చొరవతోనే మహేష్ బాబును ఒప్పించినట్లు సమాచారం. ఫ్యామిలీ ఎంట్రటైన్ మెంట్ గా రాయలసీమ బ్యాగ్ గ్రాప్ లో తీసే ఈసినిమాలో పవన్ కొత్త లుక్ తో కనిపిస్తాడట. మరి ఈ ముగ్గరు కాంబినేషన్ లో సినిమా వస్తే ఏ రేంజ్ లో ఉంటుందో వేరే చెప్పాలా అటు మెగా, ఇటు ప్రిన్స్ అభిమానులు పండగే పండగ.
source:http://www.apherald.com/Movies/ViewArticle/88574/pawan-kalyan-triviram-srinivas-mahesh-babu-princ-t/

No comments