శ్రీమంతుడిపై సమంతవ్యాఖ్యల హంగామా !


గత సంవత్సరం మహేష్ బాబు ‘వన్’ సినిమాలోని ఒక సన్నివేశం పై అనుచిత వ్యాఖ్యలు చేసి మహేష్ అభిమానుల చేత టార్గెట్ కాబడ్డ సమంత మళ్ళీ ‘శ్రీమంతుడు' ఫస్ట్ లుక్ పై తన భావాన్ని ట్విట్ చేసింది. అయితే ఇప్పటికే టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయిన నేపధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చాల వ్యూహాత్మకంగా మహేష్ ‘శ్రీమంతుడు’ ఫస్ట్ లుక్ పై కామెంట్ చేసింది సమంత. 

‘మహేష్ బాబు లుక్ హ్యాండ్సమ్ గా ఉంది ఈ సంవత్సరంలో ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది ఈ పోస్టర్ చూసిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను' అంటూ సమంత తన మనసులోని మాటను బయట పెట్టి తిరిగి మహేష్ అభిమానుల అభిమానాన్ని పొందడానికి ప్రయత్నించింది. మహేష్ సమంతల కాంబినేషన్ తో త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో సమంత లేటెస్ట్ ట్విట్ డానికి సంకేతం అనుకోవాలి.

ఈ వార్తలు ఇలా ఉండగా మొన్న విడుదలైన ‘శ్రీమంతుడు’ ఫస్ట్ లుక్ మహేష్ అభిమానులకు విపరీతంగా నచ్చితే మహేష్ విమర్శకులు మాత్రం ఈ ఫస్ట్ లుక్ పై ఒక విచిత్రమైన కామెంట్ చేస్తున్నారు. మహేష్ బాబు రౌండ్ నెక్ ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ జీన్స్ తో ఎప్పటిలాగే హ్యాండ్ సమ్ గా కనిపించినా అంతకు మించి ఈ సినిమాపై కుతూహలం రేకెత్తించే విషయం  ఏమీ ఈ ఫస్ట్ లుక్ లో  లేదు అని అంటూ ఈ సినిమా క్రేజ్ పెంచడానికి  ఈస్టిల్ ఎంతవరకు పనికి వస్తుందో చెప్పడం కష్టమే అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాదు ఈ ఫస్ట్ లుక్ ‘శ్రీమంతుడు’ క్రేజ్ పెంచడానికి పనికి వచ్చినా రాకపోయినా మహేష్ బావ గల్లా జయదేవ్ కు మాత్రం బాగా పనికి వస్తుంది అని సెటైర్లు వేస్తున్నారు. మహేష్ బాబు సైకిల్ తొక్కుతున్న ఈ స్టిల్ ను రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం ప్రచారానికి సంబంధించిన పోస్టర్ల పై వాడుకోవచ్చు అని సెటైర్లు పడుతున్నాయి. అయితే మహేష్ మాత్రం ఈ విషయాలు ఏవి పట్టించు కోకుండా ఈరోజు తన కొత్త సినిమాను శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మొదలు పెడుతూ తన స్పీడ్ ను మరింత పెంచుతున్నాడు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/88243/SAMANTHA-COMMENTS-ON-SREEMANTHUDU-FIRST-LOOK/

No comments