‘కంచె’ సినిమాలో వరుణ్ స్టిల్ లీక్...?!!


మెగా వంశంలోని మరో హీరో మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ ‘ముకుంద’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అందిరిని బాగానే మెప్పించాడు. ఈయన రెండో సినిమా క్రిష్ దర్శకత్వం వహించగా ఆయన తండ్రి జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న చిత్రం ‘కంచె’ . ఈ సినిమా ఫిబ్రవరి 27న పూజా కార్యక్రమాలు జరుపుకున్న షూటింగ్ శరవేగంగా జరగుతుంది. ఇప్పుడు ఈ సినిమా లో ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది, అదే నండి బాబు వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ లాంటి ఫొటో ఒకటి లీకై అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

వాస్తవానికి ఈ ఫోటో ఎలా లీకైందో తెలియదు కానీ ఫోటోని బట్టి చూస్తే సినిమా బ్రిటీష్ కాలం నాటి పరిస్థితులకు అద్దం పట్టేలా కనిపిస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో ఈ సినిమా కథ ఉంటుందట. పీరియాడికల్ డ్రామాగా రూపొందబోయే ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఈ మూవీలో వరుణ్ తేజ్ సరసన ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది, దసరా కానుకగా ఈ సినిమా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.

source:http://www.apherald.com/Movies/ViewArticle/88075/varun-tej-mukunda-kanche-direction-krish-film-curr/

No comments